Sat Dec 07 2024 18:04:26 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 46 : హౌస్ లో శ్రీహాన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫుడ్ కోసం టాస్కుల్లో కొట్టుకున్న రెండు టీమ్ లు
అనంతరం రెండు టీమ్ లకు టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం ఒక మెషిన్ లో నుంచి బొమ్మలు, పూలు వస్తాయి. రెండు టీమ్స్..
బిగ్ బాస్ సీజన్ 6 లో ఏడోవారం రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో సరిగ్గా ఫెర్ఫార్మ్ చేయకపోవడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఫుడ్ కట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఇంటిలో ఉండేందుకు కావలసిన అర్హత కోసం రెండు టీమ్స్ పోరాడాలని చెప్పాడు బిగ్ బాస్. 46వ ఎపిసోడ్ లో హౌస్ లో శ్రీహాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. కంటెస్టంట్లపై కనికరించిన బిగ్ బాస్.. ఉదయం సాంగ్ ప్లే చేయకుండా..కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లని లేపాడు. ఆ తర్వాత హౌస్ లో ఇకపై బాగా ఆడతామని కంటెస్టెంట్స్ ప్రతిజ్ఞ చేయాలని సూచించాడు. దీంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు తమదైన పద్దతిలో..బిగ్ బాస్ కి ప్రతిజ్ఞ చేశారు. హౌస్ మేట్స్ కి ఫుడ్ ని పంపించాడు బిగ్ బాస్.
అనంతరం రెండు టీమ్ లకు టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం ఒక మెషిన్ లో నుంచి బొమ్మలు, పూలు వస్తాయి. రెండు టీమ్స్ ఆ బొమ్మలు, పూలని కలెక్ట్ చేసి వారికి ఇచ్చిన ప్లేసెస్ లో పెట్టాలి. దీంతో రెండు టీమ్స్ మెషిన్ దగ్గరే ఉండి పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. శ్రీహన్, అర్జున్ కళ్యాణ్ మధ్య గొడవ జరగడంతో అర్జున్ కళ్యాణ్.. శ్రీహాన్ ని మెషిన్ నుంచి లాగేశాడు. దీంతో శ్రీహన్ కూడా అలాగే చేయడంతో ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. శ్రీహాన్ తొడ కొట్టి దమ్ముంటే రా చూసుకుందాం అని అర్జున్ ని రెచ్చగొట్టాడు.
ఆ తర్వాత రేవంత్ కి, శ్రీ సత్యకి మధ్య కూడా గొడవ జరిగింది. శ్రీహాన్ నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో శ్రీ సత్య కింద పడింది. దీంతో రెండు టీమ్స్ గొడవపడ్డాయి. రేవంత్ ఏం చేసినా శ్రీసత్య ఏదో ఒకటి అనడంతో రేవంత్ గట్టి గట్టిగా అరిచాడు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ను రేవంత్, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. ఇనయ- శ్రీహాన్ ఒకే టీమ్ లో ఉండటంతో.. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ కుదిరింది. కాగా.. ఈ టాస్క్ రెండు టీమ్స్ మధ్య బాగా గొడవలు పెట్టింది. బిగ్బాస్ టీఆర్పీ కోసం గేమ్ పద్ధతి మార్చాడని అర్ధమవుతుంది.
Next Story