Sat Dec 14 2024 16:56:39 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 : రోహిత్ కోసం జుట్టు కత్తిరించుకున్న వాసంతి.. షాక్ లో మెరీనా, ఇనయా డెడ్
వాసంతి - రోహిత్ లలో ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పగా.. వాదనలు లేకుండా రోహిత్ నామినేషన్ ను తీసుకున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 6 ఈ వీకెండ్ ఎపిసోడ్ అంతా నాగార్జున హౌస్ మేట్స్ తో ఎమోషనల్ టాస్క్ గురించి మాట్లాడటంతోనే సరిపోయింది. ముందుగా రోహిత్ తో మాట్లాడుతూ.. హౌస్ మేట్స్ కోసం డైరెక్ట్ గా 2 వారాలు సెల్ఫ్ నామినేట్ అయినందుకు అభినందించారు. కెప్టెన్సీ టాస్క్ కూడా బాగా ఆడావని మెచ్చుకున్నారు. ఈ వారం రోహిత్ ఆటతీరుకు గుడ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రోహిత్ నామినేషన్ తో బ్యాటరీ 100 శాతం పెరిగి మిగతా ఆరుగురు ఇంటిసభ్యులు సర్ ప్రైజ్ లను అందుకున్నారు. ఆ ఆరుగురిలో ఒకరు రోహిత్ కోసం త్యాగం చేయాలని నాగార్జున చెప్పగా.. ఎవరికి వారు ఎందుకు త్యాగం చేస్తున్నారో చెప్పమన్నారు.
వాసంతి - రోహిత్ లలో ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పగా.. వాదనలు లేకుండా రోహిత్ నామినేషన్ ను తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో వాసంతి ఏం చెప్పినా చేస్తాననడంతో.. బిగ్ బాస్ తన చుట్టును భుజానికి కట్ చేసుకోవాలని చెప్పాడు. వాసంతి ఆ త్యాగాన్ని నవ్వుతూ స్వీకరించింది. సూర్య.. వాసంతి జుట్టును కట్ చేశాడు. తర్వాత రోహిత్ ఫ్యామిలీ నుంచి అతని తండ్రి మాట్లాడిన వీడియో మెసేజ్ ను చూపించారు నాగార్జున. అదిచూసిన రోహిత్ - మెరీనా ఎమోషనల్ అయ్యారు. తర్వాత రేవంత్ తో మాట్లాడుతూ.. కెప్టెన్ అయినా నిద్రపోవడం మానలేదంటూ జోకులేశారు. అందుకు సంబంధించిన వీడియోలను చూపించడంతో హౌస్ తో పాటు ప్రేక్షకులంతా నవ్వుకున్నారు.
బాలాదిత్యతో మాట్లాడుతూ.. కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. గీతూకి బిగ్ బాస్ ఏం చెప్పాడు ? గీతూ బాలాదిత్యకు ఏం చెప్పిందో క్లారిటీ ఇచ్చారు. ఇక ఇనయా ఆట ఈ వారం ఏమాత్రం బాగోలేదంటూ.. డెడ్ అని ఇచ్చారు. మెరీనా, ఆదిరెడ్డి, సుదీప, వాసంతి ల గేమ్ ఏవరేజ్ అని, శ్రీసత్య గేమ్ చాలా బాగా ఆడిందని చెప్పారు నాగార్జున. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో శ్రీసత్య సేఫ్ అవగా.. మిగతా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నేడు తెలియనుంది.
Next Story