Sat Oct 12 2024 07:39:45 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిచేసుకున్న BB6 భామ.. సరిగ్గా గ్రాండ్ ఫినాలే టైమ్ కే ముహూర్తం
హౌస్ నుండి బయటికొచ్చిన కొద్దిరోజులకే నేను పెళ్లికి ఎస్ చెప్పాను.. నా పెళ్లిగోల మొదలైందంటూ..
నేహా చౌదరి. స్పోర్ట్స్ ఎక్కువగా చూసేవారికి ఈమె సుపరిచితురాలు. తెలుగులో పలు ఆటలకు యాంకర్ గా చేసింది. అంతేకాదు.. ఆమె జిమ్నాస్టిక్స్ లో బాగా ఆరితేరిన వ్యక్తి. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టంట్ గా అడుగుపెట్టాక.. నేహా ఎవరో తెలుగు రాష్ట్రాల వారందరికీ తెలిసిందే. హౌస్ లో ఉండగా, తన ఎలిమినేషన్ జరిగాక కూడా త్వరలోనే పెళ్లిచేసుకుంటానని చెప్పింది.
హౌస్ నుండి బయటికొచ్చిన కొద్దిరోజులకే నేను పెళ్లికి ఎస్ చెప్పాను.. నా పెళ్లిగోల మొదలైందంటూ.. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాల్లో వరుస పోస్టులు చేసింది. పెళ్లి షాపింగ్, పెళ్లి పనుల గురించి అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. 13 ఏళ్లుగా తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన అనిల్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. సరిగ్గా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే ఆమె పెళ్లి ముహూర్తం. గ్రాండ్ ఫినాలేకి ఎక్స్ కంటెస్టంట్స్ అంతా వస్తారు. నేహా కూడా.. తన ఈ ఈవెంట్ ను మిస్ అవకూడదని భావించింది.
పెళ్లి కూతురిని చేసిన వెంటనే.. అదే డ్రస్ లో గ్రాండ్ ఫినాలేలో తళుక్కుమంది. ఇక గ్రాండ్ ఫినాలే ముగియగానే.. హౌస్ మేట్స్ అంతా నేహా పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. డిసెంబర్ 18 రాత్రి 10 గంటలకు నేహా పెళ్లి ఘనంగా జరిగింది. బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో నేహాచౌదరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Next Story