Sun Dec 08 2024 04:03:52 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే5 : ఫస్ట్ కెప్టెన్ గా బాలాదిత్య..వరస్ట్ పర్ఫార్మర్ గా గీతూ రాయల్
టాస్క్ ని ముందుగా గీతూ రాయల్ పూర్తి చేసినప్పటికీ.. కారు నంబర్ ను సరిగ్గా పెట్టకపోవడంతో.. తర్వాత టాస్క్ ని పూర్తి..
మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు తమ మొదటి కెప్టెన్ ని ఎన్నుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులుగా ఉన్న మెరీనా-రోహిత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, గీతూరాయల్, నేహా, ఆర్జే సూర్య లకు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్ లో విజేతగా నిలిచిన వారే కెప్టెన్ అవుతారని చెప్పారు. టాస్క్ విషయానికొస్తే.. ఈ టాస్క్ లో వాటర్లో కీస్ ఉంటాయి. నీళ్లలో తలముంచి నోటితో ఆ కీస్ తీసుకుని పక్కనే ఉన్న బాక్స్ ని ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ లో ఒక కారు నెంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి తగ్గట్టు మరో టబ్లో ఉన్న నెంబర్స్ వెతికి తనకు కేటాయించిన కారు నెంబర్ని ఆర్డర్ లో సెట్ చేయాలి. ఈ టాస్క్ కి ఫైమా సంచాలక్గా వ్యవహరించింది.
టాస్క్ ని ముందుగా గీతూ రాయల్ పూర్తి చేసినప్పటికీ.. కారు నంబర్ ను సరిగ్గా పెట్టకపోవడంతో.. తర్వాత టాస్క్ ని పూర్తి చేసిన బాలాదిత్యను ఫైమా విన్నగా ప్రకటించింది. మిగతా ఇంటిసభ్యులు కూడా బాలాదిత్యకే సపోర్ట్ చేయడంతో గీతూకి, ఫైమాకి మధ్య గొడవ జరిగింది. ఆఖరికి బాలాదిత్య హౌస్ లో మొదటివారం కెప్టెన్ అవ్వడంతో కంటెస్టెంట్ అంతా అతన్ని కెప్టెన్ సీట్ లో కూర్చోపెట్టారు. కెప్టెన్సీ టాస్క్ తర్వాత.. బిగ్ బాస్ వరస్ట్ పర్ఫార్మర్ ను ఎన్నుకుని జైల్లో పెట్టాలని ఆదేశించాడు. దాంతో ఇంటిసభ్యుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ.. హడావిడి చేస్తున్న గీతూని ఇంటిసభ్యులు టార్గెట్ చేశారు.
ఏకంగా 15 మందికి పైగా గీతూకి వరస్ట్ పర్ఫార్మర్ గా ఓటు వేశారు. దీంతో ఈ వారం గీతూ వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నికైంది. అనంతరం ఆమెను జైల్లో వేసి తాళం వేశారు. కాగా.. వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకుంటున్న సమయంలో ఇనయా - శ్రీహాన్ ల మధ్య గొడవైంది. ఇనయా సిరి పేరు తీయడంతో.. శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నాడు. బయటి వ్యక్తుల పేర్లు హౌస్ లో తీయొద్దని సూచించాడు. ఆ తర్వాత ఇనయా.. కీర్తి భట్ గురించి మాట్లాడుతూ.. ఆమెకు నీపై ఇంట్రస్ట్ ఉందేమో అనడంతో.. శ్రీహాన్ హర్ట్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి అక్షింతలు వేస్తారో చూడాలి.
Next Story