Sat Dec 13 2025 22:35:51 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతనేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది. రెండు నెలలు పూర్తయి, ఇంకా నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్ తేదీని నిర్వాహకులు ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, సోషల్ మీడియాలో ఇప్పటికే విజేతపై చర్చ మొదలైంది. అభిమానులు తనుజ టైటిల్ దక్కించుకునే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. తనూజ ప్రతి నామినేషన్లోనూ అత్యధిక ఓట్లు సాధిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమెనే సీజన్ 9 విజేతగా భావిస్తున్నారు. చివరికి విజేత ఓటింగ్ ద్వారానే నిర్ణయం జరగనుంది. తొలి రోజు నుంచి అమాయకంగా, అందరినీ ఆకట్టుకుంటున్న తనూజ ఈ సారి టైటిల్ విన్నర్ గా భావిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ అన్నింటిలో తొలి మహిళ విజేతగా నిలిచే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
కెప్టెన్సీ రేసు నుంచి...
మరొకవైపు టాస్క్ లతో బిగ్ బాస్ అందరినీ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. మూడు టీంలుగా విడగొట్టాడు. ఆరెంజ్, పింక్, బ్లూటీంలుగా విడిపోయిన జట్లు టాస్క్ లతో దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకూ తనూజ కెప్టెన్ గా ఉన్న ఆరెంజ్ టీం ఎక్కువ టాస్క్ లను గెలిచింది. ఇక ఇప్పటికే హౌస్ మేట్స్ ద్వారా కెప్టెన్సీ కంటెండెన్సీ పోటీ నుంచి తప్పిస్తున్నారు. ఇప్పటికే రెబల్స్ ద్వారా కల్యాణ్, నిఖిల్, సాయి కోగా హౌస్ మేట్స్ అంచనాలతో డీమాన్ పవన్, గౌరవ్ లు కెప్టెన్సీ కంటెస్టెంట్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంజనాను ఏ టీం సభ్యులు తీసుకోకపోవడంతో కెప్టెన్సీ పోటీలో ఆమెను బిగ్ బాస్ తప్పించారు. తాజాగా మరొక టాస్క్ ను బిగ్ బాస్ నిర్వహించారు.
డేంజర్ జోన్ లో...
ఇప్పటి వరకూ రెబల్స్ గా ఉన్న దివ్య, సుమన్ షెట్టి, రీతూ చౌదరిలతో పాటు తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ పోటీలో ఉన్నారు. కానీ నిన్న చూపించిన ప్రోమో ప్రకారం రీతూ చౌదరిని కూడా కెప్టెన్సీ పోటీ నుంచి సాయి తప్పించినట్లు అర్థమవుతుంది. బిగ్ బాస్ తదుపరి కెప్టెన్ ఎవరవుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో రాము రాథోడ్, సాయి ఉన్నట్లు తెలిసింది. తనూజ, కల్యాణ్, సంజన, రాము రాధోడ్, సాయి, భరణి, సుమన్ శెట్టి నామినేషన్ లో ఉండగా, అందరికంటే అతి తక్కువగా ఓట్లు సాయికి పడినట్లు అర్థమవుతుంది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చివరి దశకు చేరుకుంది.
Next Story

