Sat Dec 13 2025 22:30:54 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss Season 9 Telugu : తనూజ సేవింగ్ పవర్ ఉపయోగిస్తుందా? డేంజర్ జోన్ లో ముగ్గురు
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ వాదనలు, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ వాదనలు, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హౌస్ కంటెంస్ట్ ల మధ్య ఘర్షణలు కూడా అంతే స్థాయిలో ప్రతి రోజూ ఉంటున్నాయి. గత సీజన్ లో శని, ఆది, సోమవారాలు తప్పించి మిగిలిన రోజుల్లో టాస్క్ లతో బిగ్ బాస్ నడిచిపోయేది. కానీ ఈ సీజన్ లో మాత్రం ప్రతి రోజూ వాదులాటలు ఎక్కువగా ఉండటంతో పాటు అందులోనూ యువతులు తినే తిండివద్ద, బాండింగ్ పేరుతో వాదులాటలకు దిగుతుండటంతో ప్రేక్షకులకు మరింత ఈ సీజన్ కనెక్ట్ చేసిందంటున్నారు.
ఎలిమినేషన్ ఉంటే...
తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘బిగ్ బాస్ తెలుగు 9’ రియాలిటీ షోలో హౌస్మేట్స్ మధ్య మాటల తగాదాలు నిరంతరం కొనసాగుతున్నాయి. తనుజ, మధురి, సంజనా, ఇమ్మాన్యుయేల్, సుమన్ వంటి పోటీదారులు ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచే వార్తల్లో నిలుస్తున్నారు. తనూజ, కల్యాణ్, సంజనా, డెమాన్ పవన్, మాధురి, రాము, గౌరవ్, రీతూ చౌదరి నామినేషన్లో ఉన్నారు. నిన్న దమ్ము శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోసారి భరణి ఎంట్రీ ఇచ్చి హౌస్ లో స్థానం సంపాదించుకున్నాడు.
ఈ వారం నామినేషన్ లో...
అయితే దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయితే తనూజ తన సేవింగ్ పవర్ ద్వారా సేవ్ చేసే అవకాశముందని చెబుతున్నారు. అసలు ఈ వారం నామినేషన్ ఉంటుందా? లేదా? అన్నది కూడా అనుమానమే. అయితే లీస్ట్ ఓటింగ్ లో మాత్రం రీతూ చౌదరి, డెమాన్ పవన్, మాధురి, గౌరవ్ లు ఉన్నారని తెలిసింది. కానీ రీతూ చౌదరి, డెమాన్ పవన్ ల లవ్ ట్రాక్ నడుస్తుండటంతో వారిని కదిపే అవకాశం లేదన్నది వాస్తవం. దీంతో గౌరవ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నప్పటికీ గౌరవ్ పేరు ప్రముఖంగా వినపడుతుంది.
Next Story

