Sat Dec 13 2025 22:31:42 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : బిగ్ బాస్ టాప్ 5లో ఉండేది వారేనట
బిగ్ బాస్ 9 సీజన్ తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొందింది.

బిగ్ బాస్ 9 సీజన్ తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొందింది. కంటెస్టెంట్ల ఎంపిక కూడా షోకు మరింత వన్నె తెచ్చిపెట్టినట్లయింది. అయితే ప్రతి రోజూ జరుగుతున్న టాస్క్ లు, సీక్రెట్ టాస్క్ లు, కంటెండర్ నుంచి తప్పించడాలు ఇలా అనేక రకాలుగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో మరింతగా షోకు ఆదరణ పెరుగుతుందని భావించినా దివ్య మినహా సాయి, నిఖిల్, గౌరవ్ లు పెద్దగా కెమెరా ముందు కనిపించకపోవడం ఒకింత నిరుత్సాహపడుతుంది. వారు ముగ్గురు నామ్ కే వాస్తేగానే ఉన్నట్లు కనపడుతుంది.
రెబల్స్ తప్పించిన...
అయితే తాజాగా దివ్య, సుమన్ షెట్టి రెబల్స్ గా వ్యవహరిస్తూ కల్యాణ్ పడాల ను కెప్టెన్సీ కంటెస్టెంట్ పోటీ నుంచి తప్పించారు. రెబల్స్ గా ఉన్న దివ్య, సుమన్ షెట్టి లు ఇప్పటికే రెండు సీక్రెట్ టాస్క్ లను విజయవంతంగా ముగించారు. దీంతో రెండో సీక్రెట్ టాస్క్ నుంచి నిఖిల్ ను తప్పించారు. ఆరెంజ్, బ్లూ, పింక్ టీంలలో ఇప్పటికే బ్లూ టీం బలహీనంగా మారింది. ఇక రెబల్స్ ఎవరో చెప్పాలంటూ హౌస్ మేట్స్ అందరి నుంచి ఓటింగ్ తీసుకున్నారు. దీంతో అందరూ డీమాన్ పవన్ రెబల్ అని చెప్పడంతో పవన్ పోటీ నుంచి తప్పుకున్నాడు.
టాస్క్ లతో అలరిస్తూ...
ఇప్పటికి ముగ్గురు కల్యాణ్, డిమాన్ పవన్, నిఖిల్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే మూడు టీంలు ఆడిన మరొక టాస్క్ కూడా అలరించింది. చిమ్మచీకటిగా ఉన్న రూములో ఉన్న ఐదు వస్తువుల వాసనలను గుర్తించి చెప్పాలని బిగ్ బాస్ కోరారు. ఆరెంజ్ టీం నుంచి తనూజ నాలుగు వస్తువుల పేర్లను కరెక్ట్ గా చెప్పగా, పింక్ టీం నుంచి దివ్య, బ్లూ టీం నుంచి రీతూ చౌదరి మూడు వస్తువుల పేర్లను మాత్రమే కరెక్ట్ గా చెప్పారు. ఈ టాస్క్ కు సంచాలకులుగా సంజన గుర్తించింది. దీంతో ఆరెంజ్ టీంలో మరొకరు సేవ్ అయ్యారు. ఇప్పటికే ఒక టాస్క్ గెలిచిన ఇమ్మాన్యుయేల్ సేవింగ్ రిబ్బన్ తీసుకోగా, తాజాగా గెలవడంతో తనూజకు ఆ సేవింగ్ రిబ్బన్ లభించనుంది. దీంతో వీరిద్దరినీ రెబెల్స్ కంటెస్టెంట్ పోటీ నుంచి ఎలిమినేట్ చేయడానికి వీలులేదు. టాప్ 5లో మాత్రం ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, సుమన్ షెట్టి, తనూజ, దివ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

