Sat Dec 13 2025 22:32:58 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : బిగ్ బాస్ లో డామినేషన్ అంతా వారిదే
ఈసారి బిగ్ బాస్ సీజన్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి స్పీడ్ మీదున్నారు

ఈసారి బిగ్ బాస్ సీజన్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి స్పీడ్ మీదున్నారు. వారు ఫైర్ బ్రాండ్ లాగా మారారు. అబ్బాయిలందరూ సర్దుకుపోయి ఈ సీజన్ లో వ్యవహరిస్తుండగా, అమ్మాయిలు మాత్రం ససేమిరా.. తగ్గేదేలా అంటూ తిట్ల పురాణాన్ని అందుకుంటున్నారు. కొట్టు కోవడం ఒక్కటే తక్కువ. అన్ని రకాలుగా మాటలు గేట్లు దాటుతున్నాయి. ఈ సీజన్ మాత్రం అమ్మాయిలదే డామినేషన్ గా కనిపిస్తుంది. అబ్బాయిలు మాత్రం జోకులు వేసుకుంటూ ఏదో హౌస్ లో ఉన్నామంటే ఉన్నామని అంటున్నారు. మరొకవైపు డీ మాన్ పవన్, రీతూ చౌదరి లవ్ ట్రాక్ కూడా పెద్దగా పండటం లేదు. దీంతో ఇప్పుడు అమ్మాయిల సిగపట్లు ప్రేక్షకులను టీవీ ముందు కట్టిపడేస్తుండటంతో వాటినే ఎక్కువగా చూపిస్తూ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది.
పవన్ పై తనూజ ఫైర్...
తాజాగా తనూజ డీమాన్ పవన్ పై ఫైర్ అయింది. తనూజ చేతల్లోనూ, మాటల్లోనూ యాటిట్యూడ్ చూపిస్తుంది. అలాగే అరుపులు, కేకలతో హౌస్ మేట్స్ ను తొలి నుంచి ఒక ఆటాడుతుంది. అరుపులతో పాటు ఏడుపులు కూడా తనూజ సొంతమే. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో డిమాన్ పవన్ ను తనూజ ఒక రేంజ్ లో ఆడుకుంది. బీబీ రాజ్యంలో భాగంగా రాజు, రాణులుగాఉన్న కల్యాణ్, రీతూ చౌదరి, దివ్య తనూజను తీసుకు వచ్చిటేబుల్ పై కోర్చోబెట్టమని ఆదేశించారు.దీంతో కమాండర్ గా ఉన్న పవన్ తనూజ భుజంపై చేయివేశాడు. దీంతో తనూజ ఏంటి?ఉమెన్ హ్యాండిల్ చేస్తున్నావంటూ సీరియస్ అయింది. వెనక నుంచి తనను చేతితో నెట్టిన తీరు తనకు నచ్చలేదంటూ తనూజ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పవన్ కూడా ఇక చేసేది లేక సైలెంట్ అయ్యాడు. తాను వేరే ఉద్దేశ్యంతో చేయలేదని చెబుతున్నా తనూజ మాత్రం వదలకుండా లాగుతూనే ఉంది.
దివ్య వర్సెస్ రీతూ...
ఇక మరొకవైపు బీబీ రాజ్యంలో రాణులుగాఉన్న దివ్య,రీతూ చౌదరిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. రాజు,రాణుల నుంచి ఒకరు కమాండర్స్ తో పోటీ పడాలని బిగ్ బాస్ చెప్పాడు.దీంతో తనకు ఇప్పటి వరకూ కెప్టెన్ గా గెలిచే అవకాశం రాలేదని తాను పోటీకి వెళ్లనని రీతూ చెప్పింది. కల్యాణ్ కూడా తాను కెప్టెన్ అయి చాలా రోజులయిందని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. దివ్యను పోటీకి వెళ్లాలని రీతూ, కల్యాణ్ చెప్పారు. అయితే దివ్య మాత్రం రీతూ చౌదరి ఇప్పటికే అనేక సార్లు కెప్టెన్సీ కంటెండర్ గా ఉండిందని, అయినా కెప్టెన్సీ కాలేదని, టాస్క్ లలో గెలవలేకపోయిందని దివ్య అనడంతో రీతూచౌదరి ఫైర్ అయింది. నీ గురించి నువ్వు చెప్పుకో .. నన్ను తొక్కి లేవకు అంటూ సీరియస్ అయింది. దీంతో ఇద్దరిమధ్య మాటల యుద్ధం నడించింది. చివరకు దివ్యను పంపినా టాస్క్ లో దివ్య నిఖిల్ చేతిలో ఓటమిపాలయింది.
Next Story

