Fri Dec 05 2025 11:35:57 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9: పికిల్స్ పాప ఎలిమినేషన్.. రెండు వారాలకే ఎందుకిలా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఎలిమినేషన్ విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నా అందుకు గల కారణాలు కూడా తెలుస్తున్నాయి. ఏడోవారం ఎలిమినేషన్ విషయంలో వీక్షకుల అంచనాలు వాస్తవమయ్యాయి. వైల్డ్ కార్డ్ గా వచ్చిన రమ్య మోక్ష ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. పికిల్స్ పాపగా హౌస్ లోకి అడుగు పెట్టిన రమ్య వచ్చీ రావడంతోనే ఫైర్ అయింది. రీతూ చౌదరి, డీమాన్ పవన్ ల లవ్ ట్రాక్ ను సూటిగా ప్రశ్నించింది. మీరు హౌస్ లో ఆడటానికి వచ్చారా? లేక బాండింగ్ ను పెంచుకోవడానికి వచ్చారా? అంటూ నిలదీసింది. డీమాన్ పవన్ ను అయితే నీకు బుర్రలేదంటూ ఒక లెవెల్లో ఫైర్ అయింది. రీతూ చౌదరిపై కూడా రంకెలేసింది.
తనూజను తప్పుపట్టి...
ఇక ఈ సీజన్ లో అందరినీ ఆకట్టుకుంటున్న తనూజ ను కూడా రమ్య తప్పుపట్టింది. బాండింగ్ ను పెట్టుకోవడానికే వచ్చినట్లుందని, ఫేక్ కంటెస్టెంట్ అంటూ ట్యాగ్ లైన్ తనూజకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతే కాకుండా నామినేషన్ వేసే సమయంలో తనూజపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది. దీంతో ప్రేక్షకులు ఒకింత రమ్యకు నెగిటివ్ అయినట్లు విశ్లేషణలు అందుతున్నాయి. దీంతో పాటు కల్యాణ్, తనూజ గురించి మాట్లాడుతూ కల్యాణ్ ఒక అమ్మాయిల పిచ్చోడు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీంతో పాటు తనూజ కూడా ఏమీ అనకపోవడాన్ని తప్పపట్టింది. తన జోలికి వస్తే చాచి పెట్టి ఒకటి కొడతానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను హోస్ట్ నాగార్జున గత వారం ఎపిసోడ్ లోనే తప్పుపట్టారు.
చిట్టి పికిల్స్ పాపగా...
రమ్య మోక్ష చిట్టి పికిల్స్ గా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో బిగ్ బాస్ హౌస్ కు వైల్డ్ కార్డు ద్వారా తీసుకు వచ్చారు. అయితే వచ్చిన వెంటనే ఎవరు ఏంటన్నది చూసుకోకుండా రమ్య చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ నుంచి కొని తెచ్చుకుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో తప్పు లేదు కాని, అదే పనిగా ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా తప్పుపట్టారు. నిజానికి సంజనా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రమ్య మోక్ష హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి ఆమె నోరు తెచ్చిన తంటా అని చెబుతున్నారు. మొత్తం మీద రమ్య మోక్ష వెళుతూ వెళూతూ రీతూ చౌదరిపై బిగ్ బాంబ్ పేల్చి వెళ్లిపోయింది.
Next Story

