Wed Dec 10 2025 07:34:21 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : గొడవలు సర్దుకుంటాయనుకుంటే.. మరింత ముదురుతున్నాయే
బిగ్‌బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి

బిగ్‌బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. టాప్ 5 లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. ఈ వీక్ ఎలిమినేషన్ కాకుండా ఉండేందుకు, ఆడియన్స్ తో ఓటు అప్పీల్ కోసం ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. దీంతో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి. చివరకు స్ట్రాటజీలు కూడా ప్లే చేస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ కు వ్యతిరేకంగా సంజన ఓటేయడం, అలాగే సంజనకు వ్యతిరేకంగా ఇమ్మాన్యుయేల్ ఓటేయడం నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ గా చెప్పాలి. ఇమ్మాన్యుయేల్ గేమ్ ప్లాన్ ను అర్థం చేసుకోని సంజన చివరకు తానే ఒక టాస్క్ కు దూరంగా జరగాల్సి వచ్చింది. దీంతో చివరి వారం వరకూ బిగ్ బాస్ హౌస్ లో గొడవలు తప్పేలా కనిపించడం లేదు.
ఇమ్మూ.. సంజనల మధ్య...
తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నాన్న, కూతురి మధ్య కూడా అనుకోని మాటలు వస్తున్నాయి. భరణి, తనూజల మధ్య వాగ్వాదం జరిగినట్లు కనిపిస్తుంది. నిన్న ఇమ్మాన్యుయేల్, డిమోన్ ఆడియన్స్‌తో ఇంట్రాక్ట్ కాగా.. ఈరోజు మరిన్ని గేమ్స్ పెట్టారు బిగ్‌బాస్. మిగిలినవాళ్లకి కూడా ఆడియన్స్‌తో ఇంట్రాక్ట్ అయి.. ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న ఇమ్మూకి ఆ అవకాశం దక్కింది. అంతేకాకుండా.. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు టాస్క్‌లు పెట్టాడు బిగ్‌బాస్. నామినేషన్స్ తప్పించుకుని.. ఫైనలిస్ట్‌లు అయ్యేందుకు, లీడర్ బోర్డ్‌లో పాయింట్స్ సంపాదించుకునేందుకు ఇస్తోన్న మూడో యుద్ధం పట్టుకో.. పట్టుకో అంటూ చెప్పాడు. ఈ టాస్క్‌లో భాగంగా గేమ్ సంచాలకులుగా ఇద్దరిని నియమించారు. కళ్యాణ్, సంజన సంచాలకులుగా చేస్తున్నారు.
ఈ టాస్క్ లో విజేత?
మిగిలిన వాళ్లంతా లూజ్ ప్యాంట్స్ వేసుకుని లైన్ ముందు నిల్చొన్నారు. సంచాలకులు స్టూల్ మీద నిల్చొని బాల్స్ వేయాల్సి వస్తుంది. వాటిని పోటీదారులు ప్యాంట్‌తో పట్టుకోవాలి. అలా ఎవరు ఎక్కువ పట్టుకుంటే వారు గెలిచినట్లు బిగ్‌బాస్ చెప్పాడు. సంజనా, కళ్యాణ్ బాల్స్ వేశారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోకూడదని చెప్పినట్లు ప్రోమో ప్రకారం తెలుస్తుంది. కానీ తనూజ, ఇమ్మూకి అడ్డుపడినట్లు కనిపిస్తుంది. ఆ కోపంలోనే ఇమ్మూ భరణి వైపు వెళ్లగా.. తోసుకోకూడదని చెప్పారుగా అంటారు. అయితే ఇక్కడ ఎత్తు వల్ల భరణి సుమన్ శెట్టి వైపు వస్తోన్న బాల్స్ కూడా పట్టేసుకున్నాడు. ప్రోమో ప్రకారం కళ్యాణ్ తనూజకు ఎక్కువ బాల్స్ వేసినట్లు కనిపిస్తుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య బిగ్ వార్ జరుగుతున్నట్లే కనిపిస్తుంది.
Next Story

