Fri Oct 11 2024 09:10:13 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 7 ప్రోమో : ఈసారి సరికొత్తగా..నో డౌట్.. నాగార్జునే హోస్ట్
తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సూపర్ హిట్ అయింది. రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్టింగ్..
బిగ్ బాస్.. హిందీ, తమిళ్, తెలుగు భాష ఏదైనా.. ఈ బుల్లితెర రియాలిటీ షో కి అభిమానులు ఎక్కువ. అదేస్థాయిలో వ్యతిరేకించేవారు అధికమే. తెలుగు షో విషయానికొస్తే అదొక బ్రోతల్ హౌస్ అంటూ.. షో ను నిలిపివేయాలని ఇప్పటికే పలువురు పలుమార్లు కోర్టు మెట్లెక్కారు. గత ఆరు సీజన్లుగా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్న ఈ షో మళ్లీ ఎంటర్టైన్ మెంట్ పంచేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే పలువురు నటీనటులు, సింగర్ల పేర్లు వీళ్లే కంటెస్టెంట్లంటూ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవలే ప్రోమో వదిలిన మేకర్స్.. లేట్ అయినా.. లేటెస్ట్ గా వస్తున్నామని ఈ మధ్యనే తెలిపారు.
తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సూపర్ హిట్ అయింది. రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ ప్రేక్షకులకు నచ్చలేదు. మూడో సీజన్ నుంచి.. నాలుగు సీజన్లుగా నాగార్జునే హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆయనకే బాగా కనెక్ట్ అయ్యారు. అయితే గత సీజన్లో ఎలిమినేషన్ల విషయంలో నాగ్ బాగా హర్ట్ అయ్యారని, ఆయన తర్వాతి సీజన్ నుంచి హోస్ట్ గా చేయరన్న వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఏడో సీజన్ కు రానా లేదా బాలకృష్ణ హోస్ట్ చేస్తారన్న టాక్ వినిపించింది. తాజాగా వచ్చిన ప్రోమోతో ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా ఉంటారని తేలిపోయింది. దీంతో హోస్ట్ పై ఊహాగానాలకు బ్రేక్ పడిందనే చెప్పాలి.
ఇక బిగ్ బాస్ 7 ప్రోమో విషయానికొస్తే.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ్ అదరగొట్టేశాడు. చేతిలో పాప్ కార్న్ డబ్బా పట్టుకుని.. "బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి సీజన్.. ఏం చెప్పాలి.. చాలా కొత్తగా చెప్పాలి.. హా కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్" అని చిటికె వేయగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కసారిగా రివర్స్ అవుతుండటాన్ని చూపించారు. దీంతో ఈ సీజన్ లో మేకర్స్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సీజన్ ప్రారంభమవుతుందని సమాచారం. మరి ఈసారి ఎలాంటి కంటెస్టంట్లు వస్తారో.. ఈ సీజన్లో కొత్తగా ఏం చూపిస్తారో చూడాలి.
Next Story