Mon Dec 09 2024 10:09:56 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 : ఇనయ, రోహిత్, శ్రీసత్యల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
ఇప్పుడు నెటిజన్లు, వాళ్ల అభిమానులు వారికి ఎంత రెమ్యునరేషన్ ముట్టజెప్పారని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. గత ఐదు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ కన్నా దారుణంగా సాగింది ఈ సీజన్. డిజాస్టర్ గా నిలిచింది. ఆఖరికి విన్నర్ అనౌన్స్ మెంట్ విషయంలోనూ సరిగ్గా క్లారిటీ లేకుండా చేశారు. నిజంగా శ్రీహాన్ కి ఆడియన్స్ ఓటింగ్ ఎక్కువ వస్తే.. ఎందుకు రూ.40 లక్షల ఆఫరిచ్చారన్నది రేవంత్ అభిమానుల ప్రశ్న. ఇక టాప్ 5 విషయానికొస్తే.. ఎవరెవరిని ఎలా ఎలిమినేట్ చేశారో తెలిసిందే. టాప్ 5లో ఉండాల్సిన ఇనయను వారంముందే ఎలిమినేట్ చేసేశారు. శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది.
ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే రోజున.. రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నెటిజన్లు, వాళ్ల అభిమానులు వారికి ఎంత రెమ్యునరేషన్ ముట్టజెప్పారని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 14వ వారం ఎలిమినేట్ అయిన ఇనయకు రూ.30.5లక్షల రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన శ్రీసత్య 15 వారాలకు గాను రూ.33.75 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక టాప్ 5 లో ఉన్న రోహిత్ విషయానికొస్తే..15 వారాలకు గాను.. 37.5 లక్షలు అందినట్లు లీకైంది. రోహిత్ కంటే.. నాలుగు వారాల ముందే ఎలిమినేట్ అయిన అతని భార్య మెరీనాకు రూ.27.5 లక్షలు అందాయట. జంటగా అడుగుపెట్టిన రోహిత్ మెరీనా మొత్తంగా రూ.65 లక్షలు అందుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
Next Story