Sat Dec 13 2025 19:29:28 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అయినా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడా?
బిగబాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్ కు చోటు దక్కుతుంది

బిగబాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీజన్ లో కేవలం శని, ఆది, సోమవారాలు మాత్రమే కాకుండా మిగిలిన రోజుల్లో ఆకట్టుకునే విధంగా రియాలిటీ షోను ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఇమ్మాన్యుయేల్ మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడనిపిస్తుంది. తనకు అవసరమైన వాళ్లతో స్నేహం చేయడం, లేకపోతే వదిలెయ్యడం వంటివి చేస్తున్నారు. తన కెప్టెన్సీ కోసం ఎవరినైనా బతిమాలాడుకోవటాలు, అవతలి వారిని తప్పించేందుకు ప్లాన్ వేయడాలు చూస్తుంటే ఇమ్మాన్యుయేల్ పెద్ద టార్గెట్ తో నే ఉన్నట్లుంది.
చేతికి మట్టికి అంటకుండా...
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను బయటకు పంపేందుకు తన చేతికి మట్టి అంటకుండా ఇమ్మాన్యుయేల్ చేసుకుంటున్నాడు. వరసగా కెప్టెన్ గా ఎన్నికవుతూ అందరితో మంచిగా నటిస్తూ.. జబర్దస్త్ షోను హౌస్ లో చూపిస్తూ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇమ్మాన్యుయేల్ వ్యూహాల ముందు మిగిలిన కంటెస్టెంట్స్ దాదాపు నిస్తేజంగానే చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు పది వారాలు అవుతున్నా నామినేషన్ లోకి ఇమ్మాన్యుయేల్ రాకపోవడానికి అదే కారణం. అదే తన బలమని నమ్ముతున్నారు. టాస్క్ లు బాగానే ఆడుతున్నాడు. కామెడీ కూడా పండిస్తున్నాడు.
దగ్గరగా ఉండే వారిని మాత్రమే...
కానీ ఇమ్మాన్యుయేల్ తాను దగ్గరకు తీసుకున్న వారిని మాత్రమే వెన్నుపోటు పొడుస్తూ విజయవంతంగా ముందుకు వెళుతున్నాడు. మొన్నటి వరకూ తనూజతో మంచిగా ఉండి.. తనకు అవసరం రావడంతో దివ్య పక్కన చేరాడు. దివ్య చేత తనూజను కెప్టెన్సీ పోటీ నుంచి సమర్థవంతంగా బయటకు పంపగలిగాడు. అయితే ఇమ్మాన్యుయేల్ అందరితో మంచిగా ఉండి నటిస్తూనే తనకు హౌస్ లో కావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. ఇది అతని గేమ్ లో భాగమయినప్పటికీ చూసే వారికి కొంత ఏవగింపుగా అనిపిస్తుంది. ఈవారం మరోసారి ఇమ్మాన్యుయేల్ మరోసారి కెప్టెన్ గా గెలిచి తాను టాప్ 5 లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మరి ప్రేక్షకులు ఎలా ఎంతలా ఆదరిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

