Fri Dec 05 2025 15:28:10 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss - 9 : ఈవారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో వీరు
బిగ్ బాస్ సీజన్ 9 హాట్ హాట్ గా సాగుతుంది

బిగ్ బాస్ సీజన్ 9 హాట్ హాట్ గా సాగుతుంది. ఇప్పటికే హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కామనర్ గా దివ్యను గత వారం బిగ్ బాస్ స్పెషల్ ఎంట్రీతో ఆమెను హౌస్ లోకి పంపారు. అయితే ఈవారం బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని నామినేట్ చేయగా, అందులో కెప్టెన్ రాము.. టాస్క్ లో గెలిచిన ఇమ్యాన్యుయేల్ ఇమ్యునిటీ సాధించి డేంజర్ జోన్ లో లేకుండా పోయారు. అలాగే భరణి, దివ్య, కల్యాణ్, తనూజలు కూడా నామినేషన్ లిస్టులో లేరు మొత్తం ఆరుగురు ఈ వారం సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.
ఓటింగ్ లో ముందంజలో...
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఐదో వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్లలో సుమన్ షెట్టి, ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ, సంజన, డీమాన్ పవన్, రీతూ చౌదరి ఉన్నారు. వీరిలో డబుల్ నామినేషన్ చేయడానికి ఈ వారం బిగ్ బాస్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించారు. కొందరు సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అందులో యాక్టివ్ గా ఉండే వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు సుపరిచితులైన వారిని హౌస్ లోకి పంపిస్తున్నారని సమాచారం. అందులో దివ్వెల మాధురి ఒకరన్న టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది...
ఇప్పికే నెలకుపైగా గడిచిన బిగ్ బాస్ సీజన్ మరింత రక్తి కట్టించేందుకు ఇప్పటివరకు హౌస్ షో నిర్వాహకులు పెద్ద మార్పు కోసం సిద్ధమవుతున్నారని టాక్. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అలా అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం ఫ్లోరా సైనీ, శ్రీజా దమ్ము డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. సుమన్ షెట్టికి ఓటింగ్ బాగా పడుతుండటంతో అతను సేవ్ అవుతారని అంటున్నారు. మరి చివరకు ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
ఐదో కెప్టెన్ గా కల్యాణ్...
అయితే ఈ వారం కల్యాణ్ బిగ్ బాస్ హౌస్ ఐదో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. తనూజను మోసం చేసినట్లు నెటిజన్లు కల్యాణ్ పై ఫైర్ అవుతున్నారు. అంతకు ముందు రోజు పెట్టిన టాస్క్ లో ఈ ఇద్దరి నుంచి ఒకరు సేఫ్ జోన్ లోకి వెళతారని, నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో అందుకు కల్యాణ్ తనూజను బతిమాలుకుని, తాను బలహీనంగా ఉన్నానని, తనను సేఫ్ చేయాలని కోరాడు. ఇందుకు తనూజ అంగీకరించింది. అయితే నిన్న జరిగిన టాస్క్ లో తనూజకు మద్దతివ్వకుండా కల్యాణ్ శ్రీజకు మద్దతిచ్చాడు. ఇది కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. చివరకు కెప్టెన్సీ టాస్క్ లో కల్యాణ్, తనూజ పోటీ పడగా చివరకు కల్యాణ్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. దీంతో కల్యాణ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story

