Sun Sep 24 2023 11:40:36 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 : హౌస్ లోకి కానుకతో వెళ్లిన తమన్నా.. ఆసక్తిగా న్యూ ప్రోమో
హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఎవరు తమకు బౌన్సర్ గా కావాలో ఒక బ్యాండ్ తొడిగి.. రీజన్ చెప్పాలని అడుగుతారు నాగ్. దాంతో..

బిగ్ బాస్ సీజన్ 6లో 13వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో నాగార్జున ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. అన్నట్టుగానే నిన్నటి ఎపిసోడ్ లో షానీ ఎలిమినేట్ అయ్యాడు. నేటి ఎలిమినేషన్ లో అభినయశ్రీ ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా.. తాజాగా బిగ్ బాస్ 6 నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో లో సినీ నటి తమన్నా భాటియా .. బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది.
తమన్నాను నాగార్జున ఓ కానుక ఇచ్చి హౌస్ లోపలికి పంపుతారు. హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఎవరు తమకు బౌన్సర్ గా కావాలో ఒక బ్యాండ్ తొడిగి.. రీజన్ చెప్పాలని అడుగుతారు నాగ్. దాంతో చంటి ఫైమా ని బౌన్సర్ గా కావాలంటాడు. అందుకు అతను చెప్పిన కారణం నవ్వులు తెప్పిస్తుంది. తర్వాత అర్జున్ కల్యాణ్ తనకి శ్రీ సత్య బౌన్సర్ గా కావాలంటాడు. దాంతో ఆడియన్స్ ఏదో ఉంది అని కామెంట్ చేయడంతో.. శ్రీసత్యకి కోపం వచ్చినా కవర్ చేసుకుంటుంది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పగా.. తమన్నాను నాగార్జున 100% లవ్ లో మీరుకూడా అంతేగా.. అంటే.. ఆఖరికి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసుగా అంటుంది తమన్నా.
Next Story