Sat Oct 12 2024 05:18:00 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. హౌస్ నుండి వాళ్లిద్దరూ ఎలిమినేట్
వీరిద్దరూ హౌస్ లో పెద్దగా గేమ్ ఆడినట్లు కనిపించలేదేమో ఆడియన్స్ కి. బాలాదిత్య ఎప్పుడూ.. ప్రవచనాలు చెప్తుంటాడని ప్రతీవారం
బిగ్ బాస్ సీజన్ 6 లో 10వ వారం.. వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రతివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ముందుగానే తెలిసిపోతుంది. ఈ వారం కూడా అలాగే.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెట్ పేరు లీకైంది. కానీ.. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ.. రెండ్రోజుల నుండే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ఈ వారం బాలాదిత్య, మెరీనా ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ నిజమే కానీ.. ఎలిమినేట్ అయింది బాలాదిత్య, మెరీనా కాదు.. బాలాదిత్య అండ్ వాసంతి.
వీరిద్దరూ హౌస్ లో పెద్దగా గేమ్ ఆడినట్లు కనిపించలేదేమో ఆడియన్స్ కి. బాలాదిత్య ఎప్పుడూ.. ప్రవచనాలు చెప్తుంటాడని ప్రతీవారం నాగార్జున అంటుంటారు. అలాగే వాసంతికి తన అందంపై ఉన్న ధ్యాస గేమ్ పై పెట్టదని నెగిటివ్ టాక్ వచ్చింది. పైగా.. జనాలు చూస్తున్నారు.. జనాలు చూస్తున్నారు అంటుంటుంది. గతవారం బాలాదిత్య- గీతూ ల మధ్య సిగరెట్ అండ్ లైటర్ గురించి పెద్ద గొడవే జరిగింది. దాని కారణంగా గీతూ బిహేవియర్ నచ్చక బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేశాడు. ఈ వారం బాలాదిత్య ఎలిమినేషన్ పై ఆ ఎఫెక్టే పడినట్టయింది. లీకులు నిజమో కాదో.. ఎపిసోడ్ ప్రసారమయ్యేంతవరకూ వేచి చూడాలి.
Next Story