Sat Dec 07 2024 20:48:08 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : టాప్ 5 లిస్టులో వాళ్లు.. వారిద్దరిలో ఒకరు విన్నర్ : సూర్య
హౌస్ నుండి బయటికొచ్చిన సూర్య.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
బిగ్ బాస్ సీజన్ 6లో గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అనుకున్నవారు కాకుండా.. మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఆర్జే సూర్య ఎలిమినేషన్.. అందులోనూ శనివారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఎవరూ ఊహించనిది. సూర్య ఎలిమినేషన్ తో హౌస్ మేట్స్ తో పాటు..ప్రేకులు కూడా షాకయ్యారు. సూర్యకన్నా వీక్ కంటెస్టంట్లు ఉన్నా.. వారిని వదిలి సూర్యని ఎలిమినేట్ చేయడం కొందరికి నచ్చలేదు. కారణమేదైనా కానీ.. సూర్య ఎలిమినేట్ అయిపోయాడు.
హౌస్ నుండి బయటికొచ్చిన సూర్య.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా ఎలిమినేషన్ జరిగినప్పుడు నేనేం షాక్ కాలేదు. ఎందుకంటే 7వ వారం తరువాత నుంచి ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో అందుకు సిద్ధపడే ఉంటూ వచ్చాను. నా నుంచి ది బెస్ట్ ఇచ్చాను.. బెస్టుగానే బయటికి వచ్చానని నా ఫీలింగ్. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలనుకుంటే లవ్ ట్రాక్ నడపాలి. లేదంటే బయటికి వచ్చేస్తారు అనే మాటలో నిజం లేదు. ఎవరి పరిమితులు వారికి తెలుసు. ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఒకరినొకరు నామినేట్ చేయవలసిన సందర్భాలు వస్తూనే ఉంటాయి" అని తెలిపాడు.
తనకన్నా ముందు ఎలిమినేట్ అయిన వారిలో.. చంటి ఎలిమినేషన్ జన్యూన్ గా లేదని అనిపించిందన్నాడు. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యాడనే విషయం ఇప్పటికీ అర్థంకాలేదన్నాడు. ఇక రేవంత్ విషయానికొస్తే.. ఏ టాస్క్ లో అయినా ఓడిపోతే.. తనకు ఉడుకుబోతు తనం వచ్చేస్తుందని, ఆ ఫ్రస్టేషన్ చూపిస్తాడని చెప్పాడు. టాప్ ఫైవ్ లో రేవంత్, శ్రీహాన్, గీతూ, ఫైమా, ఆదిరెడ్డిలు ఉండొచ్చని అనుకుంటున్నట్లు సూర్య అభిప్రాయపడ్డాడు. రేవంత్, శ్రీహాన్ లలో ఒకరు విన్నర్ గా నిలుస్తారని చెప్పాడు.
Next Story