Mon Oct 07 2024 14:11:23 GMT+0000 (Coordinated Universal Time)
సోహెల్ కు ప్రపోజ్ చేసిన ఇనయా..
బిగ్ బాస్ 6లో ఇనయా హౌస్ లో ఉండగా.. ఒక వీకెండ్ ఎపిసోడ్ లో గెస్ట్ గా బిగ్ బాస్ 4 కంటెస్టంట్ సోహెల్ వచ్చాడు. ఆ సమయంలో..
బిగ్ బాస్ సీజన్ 6లో.. లేడీ టైగర్ అని పేరు తెచ్చుకున్న ఇనయాకు బయటికొచ్చాక తన అభిమానుల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మొదట ఆర్జీవీ భామ అని నెగిటివ్ గా వార్తలొచ్చినా.. ఆ తర్వాత తన ఆటతీరుతో అందరినీ తనవైపు తిప్పుకుంది. తనకు ఇంతమంది అభిమానులున్నారని, ఉంటారని కలలో కూడా అనుకోలేదంది. ఇక ఇనయా ఎలిమినేషన్ చాలా అన్ ఫెయిర్ గా జరిగిందని సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఆమె అభిమానులు. ఏకంగా నాగార్జునే ఈ విషయంలో హర్టయ్యారని.. ఆమె ఎలిమినేషన్ సమయంలో వార్తలు గుప్పుమన్నాయి. ఎలిమినేషన్ తర్వాత.. బయటికొచ్చిన కంటెస్టంట్ బిజీ గా ఉంటారని తెలిసింది.
బిగ్ బాస్ 6లో ఇనయా హౌస్ లో ఉండగా.. ఒక వీకెండ్ ఎపిసోడ్ లో గెస్ట్ గా బిగ్ బాస్ 4 కంటెస్టంట్ సోహెల్ వచ్చాడు. ఆ సమయంలో సోహెల్ అంటే తనకు చాలా ఇష్టమని, తనే తన ఫస్ట్ క్రష్ అని చెప్పింది. తాజాగా ఇనయా సోహెల్ కు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. ప్రేమ ఉన్నంత వరకూ కాదు ప్రాణం ఉన్నంత వరకూ ప్రేమిస్తానంటూ సోహెల్ ముందు ఒంటికాలిపై మోకరిల్లి గులాబీ పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పింది. ఈ అవకాశం ఇన్నాళ్లూ రాలేదని, ఇప్పుడు అవకాశం వచ్చిందని తెలిపింది. కాగా.. సోహెల్ హీరోగా నటించిన లక్కీ లక్ష్మణ్ ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
Next Story