Mon Dec 09 2024 09:33:34 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 90 : బెస్ట్ కెప్టెన్ ఇనయ, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి : బిగ్ బాస్ హిస్టరీలో ది మూవ్ మెంట్
ఇక వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగ్ రేవంత్ కు, అలాగే ఫస్ట్ ఫైనలిస్టైన శ్రీహాన్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత ఈవారమంతా..
బిగ్ బాస్ సీజన్ 6..13 వారాలు పూర్తి చేసుకుంది. కానీ.. ఈ సీజన్ ది వరస్ట్ గా ఉందంటున్నారు ఆడియన్స్. బిగ్ బాస్ సీజన్ 5 బాగా బోర్ గా సాగిందనుకుంటే.. ఇది అంతకన్నా దారుణంగా ఉందని పెదవి విరుస్తున్నారు. విన్నర్ ఎవరన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. దాంతో.. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం నడుస్తున్న షో మాత్రమేనని.. రియాలిటీ షో కాదని అంటున్నారు. ముఖ్యంగా రోహిత్ ను వాంటెడ్ గా ఎలిమినేట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. 14వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని సమాచారం.
ఇక వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగ్ రేవంత్ కు, అలాగే ఫస్ట్ ఫైనలిస్టైన శ్రీహాన్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత ఈవారమంతా ఆడిన ఆట గురించి మాట్లాడుతూ.. ఆదిరెడ్డి సంచాలక్ గా బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. ఈ మధ్య శ్రీసత్య, కీర్తిలు గేమ్ లో ఓడిపోతే.. ఆ కోపాన్ని మరోలా చూపిస్తున్నారని అడిగారు. ఇక హౌస్ లో ది బెస్ట్ కెప్టెన్ ఎవరు ? ది వరస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పాలని హౌస్ మేట్స్ ని అడిగారు నాగ్. దాంతో చాలా మంది హౌస్ ఆఖరి కెప్టెన్ అయిన ఇనయ ది బెస్ట్ అని చెప్పారు. శ్రీహాన్ కూడా ఇనయని ది బెస్ట్ కెప్టెన్ అని మెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆదిరెడ్డి కెప్టెన్ గా సరిగ్గా చేయలేకపోయాడంటూ అతడిని, రేవంత్ తాను చెప్పిందే వినాలని ఒక నియంతలా, ఫుడ్ విషయంలో అందరికీ సరిగా తిండి పెట్టలేదని చెప్పారు.
ఇక చివర్లో.. బిగ్ బాస్ చరిత్రలోనే ది బెస్ట్ మూవ్ మెంట్ అంటూ.. నాగార్జున.. రేవంత్ కి తన భార్య, కూతురిని చూపించారు. కూతురిని చూడగానే రేవంత్ సంబరపడిపోయాడు. చిట్టితల్లీ ఐ లవ్ యూ అంటే మురిసిపోయాడు. తనకు కూతురు పుట్టడంతోనే గెలిచానని ఇంతకన్నా.. మరో గెలుపు ఏదీ ఉండదన్నాడు. అందరు అమ్మల కోసం.. పెదవే పలికిన మాటల్లోనే అంటూ పాట పాడి.. తన కూతురికి జోల పాట పాడాడు. ఈ ఎపిసోడ్ కాదుకాదు.. ఈ సీజన్ మొత్తానికే ఈ మూవ్ మెంట్ హైలెట్ గా నిలిచింది.
Next Story