Mon Dec 09 2024 10:01:36 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 81 : శ్రీహాన్ కి సిరి సర్ ప్రైజ్ గిఫ్ట్.. అతని రాకతో కీర్తి వెరీ హ్యాపీ
సిరిని చూడగానే ఏడ్చేశాడు శ్రీహాన్. ఫ్రీజ్ లో ఉన్న శ్రీహాన్ ను సిరి హగ్ చేసుకోవడంతో.. సిరిని కూడా ఫ్రీజ్ అవమన్నాడు..
బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారమంతా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిపోతోంది. మూడు రోజులుగా ఫ్యామిలీ మీట్ ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. 81వ రోజు గురువారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో శ్రీహాన్, కీర్తి, ఇనయా లకు సంబంధించిన వారు హౌస్ లోకి వచ్చారు. కీర్తి, ఇనయ లు తమకోసం వాళ్లిద్దరు వస్తారని ఊహించలేదు. కీర్తిని కలిసేందుకు మానస్ వస్తాడనుకున్నారు. కానీ.. తన ఫ్రెండ్, మనసిచ్చిచూడులో తోటి నటుడైన మహేశ్ బాబు కాళిదాసు వచ్చాడు. అంతకు ముందే శ్రీహాన్ ప్రేయసి సిరి వచ్చింది. సిరి ఎంటరవ్వకముందే శ్రీహాన్ ని ఫ్రీజ్ అవ్వాలని ఆదేశించాడు బిగ్ బాస్.
సిరిని చూడగానే ఏడ్చేశాడు శ్రీహాన్. ఫ్రీజ్ లో ఉన్న శ్రీహాన్ ను సిరి హగ్ చేసుకోవడంతో.. సిరిని కూడా ఫ్రీజ్ అవమన్నాడు బిగ్ బాస్. కొద్దిసేపు ఇద్దరూ అలానే ఉండిపోయారు. ఇక సిరి.. హౌస్ లో ఉన్నవారందరితో కబుర్లు చెప్పింది. శ్రీసత్యని మా వాడిని ఏడిపించకు హర్ట్ అవుతానంది. ఇనయతో.. ఏంటి శ్రీహాన్ ని పట్టించుకోవట్లేదని అడిగింది. శ్రీహాన్-సిరి ల కోసం బిగ్ బాస్ సాంగ్ ప్లే చేయగా.. ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఇక ఇల్లంతా చూస్తూ ఉండగా.. సిరి శ్రీహాన్ కి సర్ ప్రైజ్ చూపించింది. సిరి తన మెడపై వేసుకున్న శ్రీహాన్ నేమ్ టాటూని చూపించడంతో శ్రీహాన్ ఏడ్చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ దత్తత తీసుకున్న బాబు కూడా హౌస్ లోకి రావడంతో శ్రీహాన్ మరింత సర్ప్రైజ్ అయ్యాడు. బాబు తన అల్లరితో హౌస్ లో హడావిడి చేశాడు.
హౌస్ లో ఉన్న కంటెస్టంట్స్ ఎవరెవరు ఎలా మాట్లాడుతారో.. క్యూట్ గా చెప్పాడు. కీర్తికి ఎవరూ లేకపోవడంతో తన కోసం ఎవరు రారని, వచ్చే వాళ్ళందరిని చూస్తూ బాధపడింది. అయితే కీర్తి కోసం తన ఫ్రెండ్, సీరియల్ నటుడు మహేష్ రావడంతో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. కీర్తి మహేష్ ని హగ్ చేసుకొని ఏడ్చేసింది. మహేష్ కీర్తికి మోటివేషన్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు మహేష్ ఇనయాని కిస్ అడగడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇనయా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. సూర్యకి ఇనయ ముద్దులు పెట్టడంతో.. మహేష్ సెటైరికల్ గా ఇలా చేశాడని అనిపిస్తుంది ఆడియన్స్ కి.
నెక్ట్స్ ఇనయా కోసం ఆమె తల్లి వచ్చారు. తన కోసం తల్లి వస్తుందని ఊహించని ఇనయా.. ఆమెను చూడగానే ఆశ్చర్యంతో ఎమోషనల్ అయింది. తండ్రి చనిపోయాక ఇండస్ట్రీకి వచ్చింది. తన తల్లికి అది ఇష్టంలేకపోవడంతో చాలాకాలంగా ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇనయా తల్లి హౌస్ లోకి రావడంతో ఏడ్చేసింది. "నాకోసం ఇంత బాధపడుతున్నావని తెలీదు. నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక్కడిదాకా వచ్చావు. బిగ్బాస్ గెలిచి బయటకి రా" అని మోటివేట్ చేసింది. బిగ్బాస్ నుంచి బయటకి వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అని తల్లితో అడగగా ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అని చెప్పింది. తిరిగి వెళ్తున్నపుడు ఇనయా తన తల్లి పాదాలకి నమస్కరించి ఏడ్చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గానే సాగింది. ఇప్పటి వరకూ జరిగిన ఫ్యామిలీ మీట్ లో.. సిరి-శ్రీహాన్, కీర్తి- మహేష్ లదే హైలట్ గా నిలిచింది.
Next Story