Mon Oct 07 2024 15:09:52 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 6 : హౌస్ లో బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈవారం ఎలిమినేషన్ లేదా ?
ఇక శనివారం సాయంత్రం నాగార్జున.. ఆడియన్స్ తో కలిసి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా ఆరోహికి పుట్టినరోజు..
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై అప్పుడే వారంరోజులు పూర్తయింది. 6వ రోజు హౌస్ లో బర్త్ డే సెలబ్రేషన్ జరిగింది. నేహా పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ ఆమెకొక సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన తమ్ముడిని హౌస్ బాల్కనీలోకి పంపాడు బిగ్ బాస్. అలాగే నేహా కోసం ఒక చాక్లెట్ కేక్ ను స్టోర్ రూమ్ కి పంపించాడు. కానీ.. వాళ్లిద్దరూ డైరెక్ట్ గా కలవలేదు. నేహా హౌస్ లో ఉన్న టీవీ లో నుంచి తన తమ్ముడిని చూసి ఎమోషనల్ అయింది. కంటతడి పెట్టుకుంది. తర్వాత హౌస్ మేట్స్ అంతా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పగా.. నేహా హౌస్ లోపల, తమ్ముడు హౌస్ బయట కేక్ కట్ చేశారు. నేహాతో పాటు మిగతా హౌస్ మేట్స్ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఇక శనివారం సాయంత్రం నాగార్జున.. ఆడియన్స్ తో కలిసి హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా ఆరోహికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ.. పాజిటివ్ కి థంబ్స్ అప్, నెగిటివ్ కి థంబ్స్ డౌన్ చెప్పారు. ఒక్క ఇనయా సుల్తానాకి మాత్రం థంబ్స్ డౌన్ ఒక్కటే చెప్పారు. ఆమె తన ఆటతీరును మరింత మెరుగు పరుచుకోవాలని, తనకు సంబంధం లేని విషయంలో మధ్యలో మాట్లాడటం సరికాదన్నారు. అలాగే గీతూకి కూడా తన భాషను మార్చుకోవాలని సూచించారు. సైలెంట్ గా ఉంటున్న శ్రీసత్య.. ఈ వారంనుంచి మౌనం వీడి.. అందరితోనూ మాట్లాడాలని చెప్పారు.
హౌస్ లోకి వెళ్లేటపుడు ఒక్కొక్కరికి ఒక్కో కార్డు ఇచ్చిన విషయం గుర్తుంది కదూ. వాటి అర్థాలని నిన్నటి ఎపిసోడ్ లో చెప్పి.. అవి ఎవరికి ఇస్తారో ఇవ్వొచ్చన్నారు నాగార్జున. వాటిలో రేవంత్ కి, గీతూ కే ఎక్కువ కార్డ్స్ వచ్చాయి. రేవంత్ వెన్నుపోటు పొడుస్తాడని, గీతూ కన్నింగ్ గా ఉంటుందని హౌస్ మేట్స్ చెప్పడంతో.. వారిద్దరికీ ఆ బ్యాడ్జీలను ఇచ్చారు కెప్టెన్ బాలాదిత్య. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన రేవంత్, శ్రీ సత్య, ఫైమా, అభినయ శ్రీ, చంటి, ఆరోహి, ఇనయా సుల్తానాలలో.. శ్రీ సత్య, చంటి సేఫ్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో అందరూ సేఫ్ గానే ఉంటారని సమాచారం. అంటే ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.
Next Story