Sun Dec 08 2024 03:37:45 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 16 : దొంగ-పోలీస్.. హీటెక్కిన హౌస్ - అందరితో ఆడుకున్న గీతూ
బిగ్‌బాస్ మూడోవారం కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలైంది. “అడవిలో ఆట” అంటూ ఇచ్చిన టాస్క్ లో..
గతవారం నాగార్జున హౌస్ మేట్స్ కి ఇచ్చిన వార్నింగ్ ఎఫెక్టో.. డబుల్ ఎలిమినేషన్ ఎఫెక్టో తెలీదు గానీ.. ఈవారం నామినేషన్ల నుంచి హౌస్ మేట్స్ లో కసి పెరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ గేమ్ లో అందరూ తమకోసం తాము ఆడటం మొదలుపెట్టారు. రెండువారాలు ప్రశాంతంగా సాగిన బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు గొడవలతో రచ్చ రచ్చగా మారింది. మంగళవారం ఎపిసోడ్ లో ఎప్పటిలాగానే ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ల గురించి చర్చ జరిగింది. నామినేషన్లు చాలా సిల్లీ రీజన్స్ తో చేసారంటూ గీతూ రాయల్, ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇనాయ చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని, కెమెరా కోసమే అరుస్తుందని అని గీతూ అంటే.. ఆమె ఒక పిచ్చిది అని ఆదిరెడ్డి అన్నాడు.
బిగ్‌బాస్ మూడోవారం కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలైంది. "అడవిలో ఆట" అంటూ ఇచ్చిన టాస్క్ లో.. దొంగలు అడవి నుంచి వస్తువులను దొంగలించి, వ్యాపారికి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలి. ఈ దొంగలను పోలీసుల టీమ్ అడ్డుకుని.. అడవిలో 50 శాతానికి పైగా వస్తువులు ఉండేలా చూసుకోవాలి. ఆదిరెడ్డి పోలీస్ హెడ్‌గా ఉండగా, చంటి, రాజశేఖర్, రోహిత్-మరీనా, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, బాలాదిత్య పోలీసులుగా.. రేవంత్, సుదీప, కీర్తి, ఆరోహి, నేహా, ఆర్జే సూర్య, వసంతి, అర్జున్, శ్రీహాన్ లు దొంగలుగా, గీతూ రాయల్ వ్యాపారిగా ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు. పక్షుల సైరన్ మోగగానే ఆట మొదలవుతుంది.
దొంగలు అడవిలో వస్తువులను దొంగిలిస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకుంటూ ఆట మొదలుపెట్టారు. ముందుగా అర్జున్ కల్యాణ్ ని పట్టుకుని జైల్ లో వేస్తారు. ఆ తర్వాత ఆర్జే సూర్య, సుదీపలను పట్టుకుంటారు పోలీసులు. వారంతా పోలీస్ టీమ్ వేరే పనుల్లో ఉండగా జైలు నుంచి తప్పించుకుంటారు. ఇక వ్యాపారిగా ఉన్న గీతూ తన స్ట్రాటజీ మొదలుపెడుతుంది. దొంగలు దాచుకున్న బొమ్మల్లో రెండు బొమ్మలను దొంగిలించి.. ముందుగా తనకు బొమ్మలను అమ్మిన శ్రీహాన్ కు అదనంగా రూ.1000 ఇస్తుంది. దాంతో దొంగల టీమ్ మొత్తానికి శ్రీహాన్ మీద అనుమానం వస్తుంది. తర్వాత రేవంత్ తన బొమ్మలను అమ్ముతాడు. మిగతా వారు అమ్మడానికి బొమ్మలు ఉండవు.
ఈ ఆట మధ్యలో ఇనయా.. నేహా, శ్రీహాన్, రేవంత్ లతో గొడవపడుతుంది. శ్రీహాన్ ను వాడు అనడంతో అందరికీ కోపమొస్తుంది. నీకు సంస్కారం లేదా అని తిడతారు. ఒక సమయంలో రేవంత్ మితిమీరి మాట్లాడాడు అనిపించింది. ఇక ఈ టాస్క్ లో ఆరోహి కాలుకి గాయమైంది. ఈ రోజు కూడా ఈ గేమ్ కంటిన్యూ అవనుంది.
Next Story