Fri Dec 06 2024 04:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 15 : మూడోవారం నామినేషన్లు.. అరుపులు, గొడవలు.. వరుస నామినేషన్లలో ఉన్నది వీరే
ఇనయా తో గీతూ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని సుదీప చెప్పింది. మొత్తంమీద అత్యధిక ఓట్లు పడిన..
బిగ్ బాస్ సీజన్ 6 మూడో వారంలోకి ఎంటరైంది. రెండోవారం డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. సోమవారం ఎపిసోడ్ లో మూడోవారం నామినేషన్లు జరిగాయి. ఇంటిసభ్యులు సరిగ్గా ఆడని కారణంగా.. లగ్జరీ బడ్జెట్ ను కట్ చేశాడు బిగ్ బాస్. అటు నాగార్జున ఫైర్.. లగ్జరీ బడ్జెట్ లేకపోవడంతో అందరూ అలర్టైనట్టున్నారు. అందుకే ఈసారి నామినేషన్లలో అందరూ అరుచుకోవడం, గొడవలు పడ్డారు. ముఖ్యంగా ఇనయా - గీతూ ల మధ్య పెద్ద గొడవే జరిగింది.
వరుసగా మూడోవరం గీతూ, రేవంత్ లు నామినేషన్లలో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ విషయానికొస్తే.. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దర్ని నామినేట్ చేసి వాళ్ళ ముఖానికి రంగు పూయాలి. వారిని ఎందుకు నామినేట్ చేశారో చెప్పాలి. అయితే ఇందులో చాలా మంది సిల్లీ రీజన్స్ చెప్పారు. మొదట శ్రీసత్య.. ఆరోహి, ఇనయాలను నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేశావని ఇనయా ఫైర్ అయ్యింది. గీతూ.. సరిగ్గా ఆడట్లేదని సుదీప, చంటిలను నామినేట్ చేయగా, సుదీప, గీతూల మధ్య పెద్ద గొడవే జరిగింది. చంటి.. గీతూ, రేవంత్లను నామినేట్ చేశాడు. దీంతో మళ్ళీ గీతూ చంటితో గొడవ పెట్టుకుంది.
ఇనయా.. గీతూ, రేవంత్లను నామినేట్ చేయగా, మళ్ళీ గీతూ ఇనయాతో గొడవ పెట్టుకుంది. ఆదిరెడ్డి.. ఇనయా, వాసంతిలను నామినేట్ చేశాడు. వాసంతిని నామినేట్ చేయడానికి ఆదిరెడ్డి చెప్పిన రీజన్ కరెక్ట్ కాదని అంది వాసంతి. నువ్వు సరిగా ఆడు అనడంతో ఆదిరెడ్డి గట్టిగట్టిగా అరిచాడు. సుదీప.. గీతూ, శ్రీహాన్లను, బాలాదిత్య.. ఆరోహి, రేవంత్లను నామినేట్ చేశారు. వాసంతి.. ఆదిరెడ్డి, నేహాలను నామినేట్ చేయగా మళ్ళీ ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. మరీనా, రోహిత్ కలిసి.. రేవంత్, పైమాలను, ఆర్జే సూర్య.. రేవంత్, బాలాదిత్యలను నామినేట్ చేశారు.
కీర్తి.. ఆరోహి, చంటిలను నామినేట్ చేసింది. నేహా.. వాసంతి, గీతూలను నామినేట్ చేయగా.. అర్జున్.. ఆరోహి, శ్రీహాన్ లని నామినేట్ చేశారు. పైమా..రోహిత్, బాలాదిత్యలను నామినేట్ చేసింది. శ్రీహాన్.. ఇనయా, అర్జున్లను నామినేట్ చేశాడు. ఆరోహి.. శ్రీ సత్య, బాలాదిత్యలను నామినేట్ చేసింది. రాజ్ శేఖర్.. ఆరోహి, బాలాదిత్యలను నామినేట్ చేశాడు. హౌస్ మొత్తంలో గీతూ.. తనను నామినేట్ చేసినవాళ్లందరితోనూ గొడవపెట్టుకుంది. ఇనయా తో గీతూ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని సుదీప చెప్పింది. మొత్తంమీద అత్యధిక ఓట్లు పడిన రేవంత్, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్ మూడో వారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం చురుగ్గా ఆడి.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారో చూడాలి.
Next Story