Sat Dec 07 2024 15:27:36 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 12 : కెప్టెన్ గా రాజ్.. హౌస్ లోకి సుధీర్ - కృతిశెట్టి, ఉత్తమనటిగా శ్రీ సత్య
వాళ్లిద్దరూ ఇచ్చిన టాస్క్ లను హౌస్ మేట్స్ బాగా చేశారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పలు సినిమాల్లోని సీన్లు ఇచ్చి యాక్ట్ చేసి..
బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. రెండవవారం హౌస్ లో కెప్టెన్ గా రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎన్నికయ్యాడు. కెప్టెన్ ఎన్నికకు ముందు ఇనయా తనకెవ్వరూ ఓటు వేయలేదని, తనను హౌస్ లో ఎవరూ గుర్తించలేదని బోరుమని ఏడుస్తుంది. ఆ తర్వాత నేహా, ఆరోహి ఇనయాకి ఓటేస్తారు. ఆఖర్లో ఆర్జే సూర్య, సుదీప కలిసి ఆర్జే సూర్యకి ఓటేస్తారు. మొత్తం మీద చంటికి రెండు, ఆర్జే సూర్యకి మూడు, ఇనయాకి ఒకటి రాగా.. రాజ్ కి నాలుగు ఓట్లు వచ్చాయి. దాంతో రాజ్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. బాలాదిత్య కెప్టెన్ బాధ్యతల్ని రాజ్ కి అప్పగించాడు.
తర్వాత.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హీరో, హీరోయిన్లైన.. సుధీర్ బాబు, కృతిశెట్టిలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తాడు. వాళ్లిద్దరూ ఇచ్చిన టాస్క్ లను హౌస్ మేట్స్ బాగా చేశారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పలు సినిమాల్లోని సీన్లు ఇచ్చి యాక్ట్ చేసి చూపించమన్నారు. ఈ టాస్క్ లో భాగంగా రేవంత్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అంటూ పోకిరి సీన్లు చేశాడు, గీతూ రాయల్ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ డైలాగ్ చెప్పింది. శ్రీహాన్, ఫైమా కలిసి `పోకిరి`లోని లిఫ్ట్ ఎపిసోడ్ స్ఫూఫ్ చేసి నవ్వించారు. రాజశేఖర్, శ్రీ సత్య కలిసి `ప్రేమ కథా చిత్రమ్` సీన్లు చేయగా.. మధ్యలో శ్రీహాన్, ఆర్జే సూర్య వచ్చి చేశారు. శానీ, చంటి, ఆర్ జే సూర్య, అభినయశ్రీ కలిసి వెంకీ సినిమాలోని సీన్లు చేసి నవ్వించారు.
అందరిలో శ్రీసత్య, శ్రీహాన్ బెస్ట్ నటి, బెస్ట్ నటుడిగా ఎంపికయ్యారని కృతిశెట్టి, సుధీర్ బాబు అనౌన్స్ చేసి.. వారిద్దరికీ షీల్డ్స్ ఇచ్చారు. అలా ఈ ఎపిసోడ్ ఆద్యంతం సరదాగా, ఫన్నీగా సాగిపోయింది. ఆఖర్లో రేవంత్ తన బాడీ గురించి, తినే ఫుడ్ గురించి చంటి కామెంట్స్ చేస్తున్నాడని బెడ్ రూమ్ లో అప్ సెట్ అవుతాడు. తాను కెప్టెన్ అయ్యాక అందరి సంగతి చెప్తానంటాడు. అలాగే ఫైమా ఇంట్లో పనులు చేయట్లేదని, కేవలం కామెడీ మాత్రం చేస్తూ అందర్నీ నవ్విస్తుందంతేనని అంటాడు.
Next Story