Mon Dec 09 2024 11:03:33 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : ఫ్యామిలీ మీట్.. ఎమోషన్స్ తో తడిసి ముద్దవుతున్న హౌస్, పాపం కీర్తి
భార్య, కూతుర్ని చూసి ఒకింత ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. నాన్నని చూసి చాలా రోజులవడం వల్లో.. కొత్త ప్రదేశం కావడం ..
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై 11 వారాలు పూర్తయింది. మరో మూడు వారాల్లో సీజన్ పూర్తి కానుంది. ఎప్పటిలాగే ఫ్యామిలీ మీట్ అరేంజ్ చేశాడు బిగ్ బాస్. తమ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని ముందుగా చెప్పకుండా హౌస్ మేట్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. మంగళవారం నాటి ఎపిసోడ్ లో మొదట బిగ్బాస్ కోచింగ్ సెంటర్ నడిపించమని టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫైమా ఇంగ్లీష్ టీచర్, ఆదిరెడ్డి డాన్సింగ్ టీచర్, శ్రీ సత్య మేకప్ టీచర్, రాజ్ సింగింగ్ టీచర్ కాగా మిగిలిన వాళ్ళని స్టూడెంట్స్ గా చేయమన్నారు ఈ టాస్క్ ఆద్యంతం కామెడీగా సాగింది. టాస్క్ అనంతరం ఆదిరెడ్డి భార్య కవిత, కూతురుని ఇంట్లోకి పంపించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.
భార్య, కూతుర్ని చూసి ఒకింత ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. నాన్నని చూసి చాలా రోజులవడం వల్లో.. కొత్త ప్రదేశం కావడం వల్లనో కానీ.. ఆదిరెడ్డి కూతురు చాలా సమయం ఏడుస్తూనే ఉంది. దాంతో హౌస్ మేట్స్ అంతా పాపని ఆడించేందుకు ప్రయత్నించారు. తన కూతురి మొదటి పుట్టినరోజుకి బిగ్బాస్ లోనే ఉండటంతో బిగ్బాస్ కేక్ పంపించి ఆదిరెడ్డి కూతురి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశాడు. ఒక కామన్ మ్యాన్ గా బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని వారాలు కొనసాగి, నా ఫ్యామిలీని కూడా బిగ్బాస్ లో చూపించారు ఇంతకంటే ఏం కావాలి అని సంతోషించాడు ఆదిరెడ్డి.
నెక్ట్స్ రాజ్ వాళ్ల అమ్మ హౌస్ లోకి వచ్చారు. ఆమె కూడా హౌస్ మేట్స్ తో ఫ్రెండ్లీగా కలిసిపోయారు. అందరి ఆటతీరు గురించి మాట్లాడారు. ఆటలో కోపతాపాలు ఆట వరకే ఉండాలని చెప్పారు. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో ఫైమా వాళ్ల అమ్మ, శ్రీ సత్య అమ్మ, నాన్నల్ని హౌస్ లోకి పంపినట్లు చూపించారు. కొన్నేళ్ల క్రితం కీర్తి తన ఫ్యామిలీని కోల్పోయిందన్న విషయం తెలిసిందే. శ్రీసత్య వాళ్ల అమ్మ, నాన్నల్ని చూసి ఎమోషనల్ అయింది కీర్తి. శ్రీసత్య నాన్న.. కీర్తి విషయంలో నువ్వలా చేయడం బాగోలేదు. సత్య.. సత్యలాగే ఉండాలి.. నీలో మార్పు వస్తుందంటూ ఇన్ డైరెక్ట్ గా శ్రీహాన్ తో క్లోజ్ గా ఉండే విషయం గురించి చెప్పారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లంతా పాపం కీర్తి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కీర్తికోసం హౌస్ లోకి ఎవరొస్తారో చూడాలి. రేవంత్ అయితే తన భార్య,తల్లి కోసం ఎదురుచూస్తున్నాడు.
Next Story