Fri Oct 04 2024 06:28:27 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 day 43 : హీటెక్కిన హౌస్.. ఈవారం నామినేషన్స్ లో 13 మంది.. రేవంత్ తగ్గేదే లే
అలాగే రేవంత్ కెప్టెన్ గా ఉన్నపుడు రెండుసార్లు నిద్రపోయాడన్న పాయింట్ పై ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అన్నా చెల్లెళ్లుగా..
బిగ్ బాస్ 6 6వ వారం వీకెండ్ ఎపిసోడ్ అయిపోయింది. షరా మామూలు గా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయింది. ఈ వీక్ నామినేషన్స్ తో హౌసంతా హీటెక్కింది. మడ్ బాత్ తో సాగిన నామినేషన్స్ లో కెప్టెన్ గా ఉన్న ఆర్జే సూర్య, గీతూ మినహా మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేట్ అయ్యారు. రోహిత్ రెండువారాలకు సెల్ఫ్ నామినేషన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్కువమంది బాలాదిత్యను నామినేట్ చేశారు. సర్ ప్రైజ్ టాస్క్ లో బాలాదిత్య అధిక శాతం బ్యాటరీ వాడుకోవడంతో.. మిగతా 9 మందికి తమ ఇంటివారితో మాట్లాడే ఛాన్స్ పోయేదనుకున్నామని చెప్పారు.
అలాగే రేవంత్ కెప్టెన్ గా ఉన్నపుడు రెండుసార్లు నిద్రపోయాడన్న పాయింట్ పై ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే గీతూ, బాలాదిత్య మధ్యలో విబేధాలు వచ్చాయి. గీతూ బాలాదిత్యని నామినేట్ చేయడంతో నాగార్జున నువ్వు మోసం చేశావని ఓ వీడియో చూపించారు. కానీ అది నిజం అని ఇప్పుడు తెలుస్తుందని చెప్పి బాలాదిత్య బాగా హర్ట్ అయ్యాడు. ఇక శ్రీహాన్ ఇనయాని తాను చేసినవి గుర్తుచేయడంతో ఇనయా సీరియస్ అయి నువ్వు ఏం పీకావ్ అంటూ కంట్రోల్ తప్పింది. అర్జున్ - ఆదిరెడ్డి ల మధ్య కొద్దిసేపు వాదన జరిగింది. అలాగే పాలు- టీ విషయంలో శ్రీసత్య- రేవంత్ కి మధ్య ఒకరకంగా గొడవే జరిగింది.
మెరీనా విషయంలో కూడా ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. మరోవైపు రాజ్, వాసంతి కూడా గొడవపడ్డారు. అందరూ బాలాదిత్యని మంచోడు అంటూనే ఈ వారం ఎక్కువమంది బాలాదిత్యని నామినేట్ చేయడం విశేషం. చివరి నామినేషన్లో రేవంత్ షర్ట్ విప్పేసి షవర్ కింద పుష్ప యాటిట్యూడ్ లో కూర్చుని.. ఎవరైనా రాని.. ఏమైనా కానీ.. పుష్ప - తగ్గేదే లే అని డైలాగ్ చెప్పాడు. అంతకుముందు రాజ్ కూడా షర్ట్ విప్పేసి బురదనీటి కింద కూర్చుండగా.. ప్రభాస్ లా ఉన్నావని ఇనయా కామెంట్ చేసింది. ఈ వారం రేవంత్, బాలాదిత్య, రోహిత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్, ఫైమాలు నామినేట్ అయ్యారు. ఈ 13 మందిలో ఎవరు గేమ్ బాగా ఆడి సేవ్ అవుతారు చూడాలి.
Next Story