Sat Dec 07 2024 13:42:20 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ తెలుగు 8: షో నుండి నిష్క్రమించిన ప్రముఖ మహిళా కంటెస్టెంట్
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తొమ్మిదవ వారాన్ని
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తొమ్మిదవ వారాన్ని పూర్తి చేసుకోనుంది. పలువురు పోటీదారులు గేమ్‌లో ఉండటానికి పోరాడుతూ ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో యష్మీ, టేస్టీ తేజ, నాయని పావని, గౌతం కృష్ణ, హరి తేజ ఉన్నారు. ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్లు చూస్తే యష్మీ అత్యధిక ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, గౌతమ్ కృష్ణ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టేస్టీ తేజ, నాయని పావని, హరి తేజలు తక్కువ ఓట్లను సొంతం చేసుకున్నారు.
ఈ వారం హరితేజ, నాయని పావని మధ్య ఎలిమినేషన్ జరగనుందని లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నాయని పావని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఎలిమినేట్ చేశారని కూడా కొన్ని సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి. ఆమె ప్రయాణం 9 వారాల తర్వాత ముగిసింది. పావని నిష్క్రమించవచ్చని గతంలో కూడా నివేదికలు సూచించినప్పటికీ ఆమె షోలో కొనసాగింది. ఇక ఈ సీజన్లో ఇప్పటికే బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, మెహబూబ్ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా తొమ్మిది మంది పోటీదారులు ఎలిమినేట్ అయ్యారు.
Next Story