Sat Dec 13 2025 22:30:57 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : రాము రాధోడ్.. నువ్వే గెలిచావు... నువ్వే నిజమైన ఛాంపియన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా సెల్ఫ్ ఎలమినేషన్ చేసుకుని రాము రాధోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా సెల్ఫ్ ఎలమినేషన్ చేసుకుని రాము రాధోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు. గతంలో సంపూర్ణేష్ బాబు కూడా హౌస్ లో ఇమడలేకపోయాడు. బిగ్ బాస్ సీజన్ మొదలయి పది వారాలు కావస్తుంది. అంటే 70 రోజుల పాటు హౌస్ లో ఉండి తామేం కోల్పోతున్నామో తెలుసుకుని తమంతట తామే వెళ్లిపోతున్న వారిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వారికి తల్లి, తండ్రి, కుటుంబం అంటే ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాము రాథోడ్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం తల్లి అని చెప్పక తప్పదు. తల్లిపైన రాము రాధోడ్ హౌస్ లో పాట రూపంలో చెప్పిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి అంటే ఎంత ప్రేమ లేకపోతే డబ్బులొచ్చి పడే హౌస్ ను కాదనుకుని వెళ్లిపోయాడు.
తల్లి మీద ప్రేమ...
అందుకే రాము ది గ్రేట్ అనాలి. రాము రాధోడ్ చెప్పిన తీరు కూడా కళ్ల వెంట నీరు తెప్పించింది. తమ చిన్ననాడు కూలీపనులకు వెళ్లేందుకు తన తల్లిదండ్రులు నెలల తరబడి వెళ్లేవారని, తాను ఎదిగి వచ్చిన తర్వాత వారిని కాపాడుకోవాల్సిన తాను ఇక్కడ ఉండటం మంచిది కాదని భావించానని చెప్పాడు. అంతేకాదు..వారికి తన అవసరం ఎంతో ఉందని చెప్పడం కూడా తల్లిదండ్రులపై రాము రాథోడ్ కు ఉన్న ప్రేమానురాగాలు చెప్పకనే తెలుస్తుంది. ఈ వారం హౌస్ లో ఉంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తారు. వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉన్నప్పటికీ రాము రాధోడ్ బయటకు వెళ్లిపోవడాన్ని మాత్రం కేవలం అతనికి కుటంబం పట్ల ఉన్న బలహీనతగానే చూడాలి.
సెల్ఫ్ ఎలిమినేషన్...
సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు. గుండె నిబ్బరం గురించి మాట్లడే వారికి ఇప్పుడు అందుకు కావాల్సింది గుండె ధైర్యం కాదు.. గుండె నిండా ప్రేమ అని రాము రాథోడ్ నిరూపించాడు. నిజానికి రాము రాథోడ్ బలహీనమైన కంటెస్టెంట్ కాదు. అతనికంటే బలహీనమైన వారు ఎందరో ఉన్నారు. కానీ రాము రాథోడ్ కు హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు తరచి తరచి వెళ్లిపోతావా? అని ప్రశ్నించినా తాను వెళ్లిపోతానని మాత్రమే చెప్పాడు కానీ, ఎక్కడా మరో ఆలోచన కూడా చేయకపోవడం రాము రాథోడ్ కు కుటుంబంపై... అదీ తల్లి, తండ్రి, తన పెంపుడు జంతువులు, తన పెద్ద కుటుంబంపై ఉన్న అపారమైన ప్రేమ అని చెప్పక తప్పదు. రాము రాధోడ్ నువ్వు గెలిచావు. ప్రేక్షకుల గుండెల్ని.. నువ్వే బిగ్ బాస్ నిజమైన ఛాంపియన్ వి. ఇది నిజం.
Next Story

