Sat Dec 13 2025 22:35:00 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 9 : దివ్య కుట్రలను వీడియోలతో బయట పెట్టిన నాగార్జున
బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్స్ కుట్రలను ఎప్పటికప్పుడు హోస్ట్ నాగార్జున బయటపెడుతున్నారు

బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్స్ కుట్రలను ఎప్పటికప్పుడు హోస్ట్ నాగార్జున బయటపెడుతున్నారు. తాము గెలవాలనుకోవడం వేరు. తాము గెలవడాన్ని పక్కన పెట్టి మరొకరిని సపోర్ట్ చేసి కెప్టెన్ గా గెలిపించడం వరకూ ఓకే. కానీ మరొక కంటెస్టెంట్ ను కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించడం పైనే నాగార్జున అభ్యంతరం తెలిపారు. ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన దివ్యకు నాగార్జున ఇచ్చి పడేశారు. ఆమె తాను అలా చేయలేదని చెప్పుకోవాలని ప్రయత్నించినా వీడియాలో బయటపెట్టి తనూజ కెప్టెన్సీ కాకుండా దివ్య ఆడిన కుట్రలను నాగార్జున బయటపెట్టారు.
కల్యాణ్ ను తొలగించి...
దివ్య ఎక్కడికక్కడ తనూజను కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించింది. ముందుగా సీక్రెట్ టాస్క్ లో విజయం సాధించి తన టీంలోనే ఉన్న కల్యాణ్ ను దివ్య తప్పించింది. భరణిని తప్పించకుండా కల్యాణ్ ను తప్పించిన వైనాన్ని కూడా ప్రశ్నించారు. అలాగే డీమాన్ పవన్ వద్దకు వెళ్లి ఎవరికి సపోర్ట్ చేస్తావని దివ్య అడిగింది. తాను రీతూకే సపోర్ట్ చేస్తానని చెప్పడంతో అయితే రీతూ ఉంటే ఓకే.. కానీ ఇమ్మాన్యుయేల్ తో మరొకరు పోటీ పడితే వారిని పోటీ నుంచి తప్పించాలని కోరింది. అంటే నేరుగానే తనూజను తప్పించాలని దివ్య కోరినట్లు వీడియాలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను నాగార్జున బయట పెట్టారు.
ఇమ్మాన్యుయేల్ కు మద్దతు ఇవ్వాలని...
అలాగే గౌరవ్ వద్దకు వెళ్లి కూడా తనూజ ఇమ్మాన్యుయేల్ కు సపోర్ట్ చేయాలని, తనూజను పోటీ నుంచి తప్పించేయాలని కోరిన వీడియోను కూడా నాగార్జున బయట పెట్టారు. ఈ వీడియోలను చెబుతూ దీనివల్ల దివ్య గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. పోటీలోనూ కల్యాణ్ కు తనూజను పోటీ నుంచి తప్పించనని చెప్పి తర్వాత తొలగించడాన్ని కూడా నాగార్జున ప్రశ్నించారు. అందుకే దివ్యకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. నువ్వు గెలవాలనుకుంటే గెలిచేలా ఆడు. అలాగే నువ్వు గెలిపించాలనుకున్నోళ్లను కూడా గెలిపించవచ్చు. కానీ మరొకరిని పోటీ నుంచి తప్పించాలని కుట్రలు చేయడం మాత్రం ప్రేక్షకులు కూడా అంగీకరించరని చెప్పడంతో దివ్య కూడా తాను చేసిన తప్పును చివరకు ఒప్పుకోక తప్పింది కాదు. మరొకవైపు హౌస్ లో ఉన్నవారు ఐదుగురు తనూజ టాప్ లో ఉన్నారని చెబితే, మరొక ఐదుగురు ఇమ్మాన్యుయేల్ టాప్ లో ఉన్నారని చెప్పడం విశేషం.
Next Story

