Fri Dec 05 2025 17:33:32 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss 9 : ఎలిమినేషన్ ఇలా కూడా జరుగుతుందా?
బిగ్ బాస్ 9 సీజన్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి

బిగ్ బాస్ 9 సీజన్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రేక్షకులు ఓటేసి ఎలిమినేట్ చేస్తే పరవాలేదు. కానీ నిన్న ప్రసారమయిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో దమ్ము శ్రీజను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారి ద్వారానే ఎలిమినేట్ చేయడం అన్యాయమంటున్నారు. దమ్ము శ్రీజ శారీరకంగా అందరికంటే బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఆమె ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో తాను అనుకున్నది అనుకున్నట్లు ఇచ్చి పడేస్తుంది. ఎవరినీ వదలదు .. దులిపేస్తుందన్న పేరు తెచ్చుకున్న దుమ్ము శ్రీజ ను హౌస్ నుంచి పంపించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరుగురు సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో...
తాజాగా బిగ్ బాస్ సీజన్ లోకి ఆరుగురు సభ్యులు వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తాలను వైల్డ్ కార్డు ఎంట్రీతో పంపారు. ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తూ సైలెంట్ గా ఉన్న ఫ్లోరా సైనీని తొలుత ఎలిమినేట్ చేశారు. ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నట్లుగానే జరిగింది. అయితే సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ లు డేంజర్ జోన్ లో ఉండగా వారికి టాస్క్ లు పెట్టి ఆడించకుండా, కేవలం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఆరుగురి అభిప్రాయంతోనే దమ్ము శ్రీజను హౌస్ నుంచి బయటకు పంపారు. అంతకు ముందు ఫ్లోరా సైనీ (లక్స్ పాప) ఎలమినేట్ అయింది. కానీ ఊహించని విధంగా దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయింది.
ప్రత్యేక పవర్ ఇచ్చి...
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారికి ప్రత్యేక పవర్ కూడా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఐదు వారాల తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారికి ప్లే కంటే పవర్ ఇవ్వడమేంటన్న ప్రశ్నలు ఉత్ప్నమవుతున్నాయి. నిఖిల్ కు ఇచ్చిన పవర్ తో అతను నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లభించింది. అందుకోసం పింక్ స్టోన్ ఇచ్చారు. గౌరవ్ గుప్తాకు బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు. తాను తప్పులు చేస్తే బిగ్ బాస్ తోనేరుగా మాట్లాడే అవకాశం ఈ పవర్ ద్వారా దక్కింది. హౌస్ లో కంటెంట్ ఫుల్లుగా ఇస్తున్న రీతూ చౌదరి, డీమాన్ పవన్ లను ఎలిమినేషన్ నుంచి బయటపడేయడం కూడా విమర్శలకు దారి తీసింది. బిగ్ బాస్ 9వ సీజన్ లో రణరంగం అని చెబుతున్నప్పటికీ స్క్రీన్ ప్లే.. డైరెక్షన్ ఎక్కడో ఉందన్న కామెంట్స్ మాత్రం బలంగా వినపడుతున్నాయి.
Next Story

