Fri Dec 05 2025 14:24:46 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యలో జనసేనాని
అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మరికాసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు

అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మరికాసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అనేక మంది వీవీఐపీలు తరలి వచ్చారు. అయోధ్యకు ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అనుపమ ఖేర్,రజనీకాంత్ వంటి వారుచేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, తనయుడు రామ్చరణ్ లు కూడా అయోధ్య కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
అగ్రనేతలంతా...
ఇటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ అగ్రనేతలంతా హాజరయ్యారు. అయోధ్య రామాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ఉద్వేగ భరితంగా ట్వీట్ చేశారు. ధర్మో రక్షిత రక్షిత: జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని ఆయన ట్వీట్ చేశారు. అనేక మంది ఇప్పటికే అయోధ్యలో వారికి కేటాయించిన స్థానాల్లో ఆశీనులయ్యారు.
Next Story

