Sun Oct 06 2024 02:08:30 GMT+0000 (Coordinated Universal Time)
పీకల్లోతు కష్టాల్లో భారత్
కీలకమైన మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు తడబడుతున్నారు. మూడో ఓవర్ కే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడినట్లయింది.
కీలకమైన మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు తడబడుతున్నారు. మూడో ఓవర్ కే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడినట్లయింది. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. అయితే ఓపెనర్ గా వచ్చిన కెఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూ కింద ఔటయ్యారు.
కొహ్లీ ఒక్క పరుగు చేయకుండానే...
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కొహ్లి డక్ అవుట్ అయ్యారు. ఒక్క పరుగు చేయకుండానే కొహ్లి క్లీన్ బౌల్డ్ కావడంతో స్టేడియంలో భారత్ అభిమానుల్లో నీరసం ఆవహించింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. శ్రీలంక బౌలర్ల ధాటికి భారత్ బ్యాటర్లు విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం భారత్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఇరవై రెండు పరుగులు మాత్రమే చేసింది.
Next Story