Sat Oct 12 2024 06:27:29 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను కలవరపెడుతున్న ఆ ఆటగాళ్ల ఫామ్
విరాట్ కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత మూడేళ్లుగా కోహ్లీ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది.
ఆసియా కప్ 2022 టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు 28న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ 2022లో రెండు జట్లు ఒకే గ్రూప్ Aలో ఉన్నాయి. రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా ఉండగా, బాబర్ ఆజం టోర్నమెంట్లో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించబోతున్నాడు. టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్‌లు రెండు శక్తివంతమైన జట్లు. టోర్నీకి అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును భారత్ ఎంపిక చేసింది. అయితే కొందరు ఆటగాళ్ల పేలవమైన ఫామ్ పెద్ద సమస్యగా మారింది.
విరాట్ కోహ్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత మూడేళ్లుగా కోహ్లీ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. టెస్ట్, వన్డే లేదా T20I అయినా.. విరాట్ కోహ్లీ మునుపటిలా ఆడడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ నాలుగు టీ20 మ్యాచ్ లలో ఆడాడు. అందులో అతను కేవలం 20.85 సగటుతో 81 పరుగులు చేశాడు. ఒక గేమ్‌లో హాఫ్ సెంచరీ మాత్రమే చేసాడు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో కోహ్లీ నెం.3 స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. బ్యాటింగ్‌లో రాణిస్తాడని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.
రిషబ్ పంత్.. ఎప్పుడు ఆడుతాడో.. ఎప్పుడు విఫలమవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. నిలకడ లేకుండా పోవడంతో జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పంత్ ఈ ఏడాది వన్డేలు, టెస్టుల్లో బాగా ఆడినప్పటికీ.. పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎడమచేతి వాటం ఆటగాడు.. 13 టీ20 మ్యాచ్ లు ఆడాడు, అందులో అతను 26.0 సగటుతో 260 పరుగులు చేశాడు. 2022 ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరులో పంత్ ఫామ్ జట్టుకు కీలకమైన అంశం.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప.. గొప్ప ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమే అయింది. T20 ఫార్మాట్లో అతని ఫామ్‌ను అద్భుతమైనదిగా పేర్కొనలేము. ఈ ఏడాది 13 టీ20ల్లో శర్మ 24.16 సగటుతో 290 పరుగులు చేశాడు. కేవలం 1 ఫిఫ్టీ మాత్రమే కొట్టాడు. రోహిత్ శర్మ పాకిస్తాన్‌పై భారత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు.. ఈసారి అతడి ఓపెనింగ్ భాగస్వామ్యం ఎలా ఉండబోతోందోనని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.
News Summary - India vs Pakistan 3 Indian Players Who Can Cost India The Asia Cup Match
Next Story