Fri Dec 12 2025 04:29:07 GMT+0000 (Coordinated Universal Time)
Bus Accident : బస్సు ప్రమాదానికి అసలు కారణమిదే.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే?
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేని తెలిసింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేని తెలిసింది. అతివేగంతో పాటు ఆ మార్గం కూడా బస్సు డ్రైవర్ కు కొత్త కావడంతోనే అదుపు తప్పి లోయలోపడిందని తెలిసింది. మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా ప్రాధమికంగా గుర్తించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ వృద్ధులేనని తెలిసింది. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దాదాపు ఇరవై మందికి పైగానే ప్రయాణికులలో మరో ఇద్దరి నుంచి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక ప్రయివేటు బస్సు అదుపు తప్పి లోయలోపడింది. అల్లూరు సీతారామరాజు జిల్ల చింతూరు - మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పొగమంచు వల్ల కూడా...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 37 మంది ఉన్నారని, ఎక్కువ మందికి కాళ్లు, చేతులు విరిగాయని, కొందరికి తలలు పగిలాయని అంటున్నారు . . భద్రాచలం నుంచి అన్నవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే చింతూరు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో లోయలో పడిన వెంటనే సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు ఎనిమిది వరకూ 105 వాహనాలు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని, మృతదేహాలను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అరకు నుంచి భద్రాచలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన...
తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారంతా వృద్ధులేనని అంటున్నారు. దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా ఘాట్ రోడ్డులో నడపటం ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని తెలిసింది. స్పాట్ లోనే దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకూ మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన AP 39 UM 6543 నెంబరు గల బస్సులో తీర్ధయాత్రలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వేరే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story

