Sun Oct 06 2024 00:39:04 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ ద్రావిడ్ కు కరోనా.. స్టాండ్ బై కోచ్ గా లక్ష్మణ్
ఆగస్టు 28 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని
భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా పాజిటివ్ గా తేలాడు. ఆసియా కప్-2022 కోసం UAE నుండి బయలుదేరే ముందు ఆటగాళ్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. ద్రావిడ్ కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో రాహుల్ ద్రావిడ్ టోర్నమెంట్లో పాల్గొనడం అనుమానంగా ఉంది. భారత ప్రధాన కోచ్ గా ఆసియా కప్ నుండి ఇంకా తొలగించబడనప్పటికీ, నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) NCA హెడ్ VVS లక్ష్మణ్‌ను భారత జట్టుకు కోచ్ గా పంపడానికి సిద్ధంగా ఉంచింది. ఆసియా కప్ 2022, 15వ ఎడిషన్, ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సి ఉంది. మొత్తం టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది.
ఆగస్టు 28 ఆదివారం దుబాయ్‌లోని 'దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం'లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జాతీయ క్రికెట్ జట్టు బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. "టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఆసియా కప్ 2022 కోసం UAEకి బయలుదేరే ముందు నిర్వహించిన సాధారణ పరీక్షలో COVID-19 పాజిటివ్ వచ్చింది. ద్రవిడ్ BCCI వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారు. ద్రావిడ్ కు COVID-19 నెగటివ్ వచ్చిన తర్వాత అతను జట్టుతో చేరతాడు" అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మంగళవారం అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ద్రవిడ్ గైర్హాజరీతో దుబాయ్‌లోని భారత జాతీయ క్రికెట్ జట్టును చూసుకోవాల్సిందిగా టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేని బీసీసీఐ అధికారులు కోరారు.
Next Story