Thu Sep 12 2024 11:33:39 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతోందంటే..?
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగి చాలా సంవత్సరాలే అవుతుండగా.. ఇలా టోర్నమెంట్లలో చిరకాల ప్రత్యర్థులు తలపడుతూ ఉండడంతో అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లభిస్తూ ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆదివారం నాడు ఆగస్ట్ 28న భారీ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి 2018లో టైటిల్‌ను గెలుచుకుంది మెన్ ఇన్ బ్లూ. ఈ ఏడాది ఆసియా కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ 2000, 2012 సంవత్సరాలలో ఆసియా కప్‌ను గెలుచుకుంది, కానీ ఆ తర్వాత టైటిల్ ను గెలవలేదు. చివరిసారి దుబాయ్ లోనే జరిగిన ఆసియా కప్ లో పాకిస్థాన్ సూపర్ ఫోర్లో బంగ్లాదేశ్‌తో ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అంతేకాకుండా, వారు ఆ టోర్నమెంట్ లో భారత్‌తో రెండుసార్లు ఓడిపోయారు. దుబాయ్‌లోని ఇదే వేదికపై గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన తర్వాత పాకిస్థాన్‌కు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇరు జట్లు తమ కీలక ఆటగాళ్లలో కొందరిని ఆసియా కప్ కోసం కోల్పోయాయి. పాకిస్థాన్‌కు షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ అందుబాటులో లేరు. భారత్‌కు హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా సేవలు దూరమయ్యాయి.
IND vs PAK మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది?
మ్యాచ్ ఆడే సమయానికి వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. అలాగే గాలిలో తేమ కూడా ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయి. Accuweather ప్రకారం, గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. గంటకు 26 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశాలు లేవని భావిస్తూ ఉన్నారు.
News Summary - Asia Cup 2022 Match 2 India vs Pakistan Weather Forecast
Next Story