ఆసియా కప్ 15వ ఎడిషన్ వివరాలు
ఆసియా కప్ 15వ ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు.
ఆసియా కప్ 15వ ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు. దీనిని మొదట శ్రీలంకలో నిర్వహించాలని అనుకున్నారు.. అయితే ఆ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా మిడిల్ ఈస్ట్ కు తరలించారు. టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొంటాయి.. మూడు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్టు ఉండగా.. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి, రౌండ్-రాబిన్ ఫార్మాట్లో నాలుగు జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. ఆ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య దుబాయ్లో నిర్వహించనున్నారు. సూపర్ 4 మ్యాచ్ లు సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 9 మధ్య నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ చివరి ఎడిషన్ కూడా 2018లో UAEలో జరిగింది. భారతదేశం డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. 2016 తర్వాత టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరగడం ఇది రెండోసారి. ఈ పోటీల్లో భారత్ ఏడుసార్లు, శ్రీలంక ఐదుసార్లు, పాకిస్థాన్ రెండుసార్లు గెలుపొందాయి.