Thu Mar 19 2026 02:31:09 GMT+0530 (India Standard Time)
Breaking : కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం.. నాలుగు స్థానాల్లో మెజారిటీ
కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు

కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. ఎన్డీఏ కూటమి నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉండగా, వైసీపీ ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు. మండపేట, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నెల్లూరు సిటీలో...
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన ఫలితాల ప్రకారం చూస్తే వైసీపీ ఇంత వరకూ బోణీ కొట్టలేదు. టీడీపీ మాత్రం నాలుగు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ ఇప్పటికే అంచనాలు వేయకపోయినా వేవ్ మాత్రం టీడీపీ కూటమి వైపు ఉందనే చెప్పాలి.
Next Story

