Fri Dec 05 2025 15:36:16 GMT+0000 (Coordinated Universal Time)
అసలు గుట్టు విప్పిన వైవీ
విశాఖ రాజధానిగా పాలన కొనసాగుతుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలుత సీఎం కార్యాలయం వస్తుందని ఆయన చెప్పారు

విశాఖ రాజధానిగా పాలన కొనసాగుతుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయం వస్తుందని ఆయన చెప్పారు. ఆ తర్వాతనే మిగిలిన కార్యాలయాలు విశాఖకు చేరుకుంటాయని చెప్పారు. న్యాయవివాదాలు పరిష్కారం అయ్యే వరకూ మిగిలిన కార్యాలయాలు రావడంలో కొంత ఆలస్యమవుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
దశల వారీగా...
దశలవారీగా విశాఖపట్నానికి కార్యాలయాలు చేరుకుంటాయని తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు తమ ప్రభుత్వం లక్ష్యమని, ఆ దిశగానే తమ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన మీడియాతో తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దసరా నాటికి ముఖ్యమంత్రి విశాఖకు చేరుకుంటారని ఆయన తెలిపారు.
Next Story

