Sun Feb 01 2026 23:16:47 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పార్టీ పెడితే ఏంటట?
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడతానని చెప్పారు.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడతానని నేరుగా చెప్పలేదు కాని, పార్టీ పెడితే తప్పేంటని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అని వైస్ షర్మిల ప్రశ్నించారు.
పాదయాత్రకు....
పరిస్థితులను బట్టి ముందుకు వెళతామని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ నెల 19 లేదా 20వ తేదీన పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనల పేరిటి పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలని వైఎస్ షర్మిల అన్నారు. నిబంధనల ప్రకారమే తాము పాదాయత్ర చేపడతామని షర్మిల పోలీసులకు దరఖాస్తు చేసుకోనున్నారు.
- Tags
- ys sharmila
- ysrtp
Next Story

