Thu Dec 18 2025 13:36:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు వైఎస్సార్టీపీ విలీనం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో ఉన్నారు. నేడు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో ఉన్నారు. నేడు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు. నిన్న విజయవాడ వెళ్లిన వైఎస్ షర్మిల తన కుమారుడి నిశ్చితార్థ ఆహ్వానాన్ని తన సోదరుడు వైఎస్ జగన్కు అందించిన తర్వాత ఆమె విజయవాడ నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రికి ఢిల్లీకి చేరుకున్న వైఎస్ షర్మిల అక్కడే బస చేశారు.
అగ్రనేతల సమక్షంలో...
ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమె తన పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

