Thu Jan 29 2026 06:59:57 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ ను కలిశాడు.. సస్పెండ్
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ను ఆదివారం నాడు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వైసీపీ తెలిపింది.

జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ను ఆదివారం నాడు కలిసిన ఎమ్మెల్యేపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) వేటు వేసింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వైసీపీ తెలిపింది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికార పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా విజయానందరెడ్డిని నియమించినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న శ్రీనివాసులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్తూరు ఎమ్మెల్యే త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయన తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన టిక్కెట్ ఆశించినట్లు సమాచారం. ఆంధ్రాలో జరగనున్న ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలను, 25 లోక్సభ స్థానాలకు గాను మూడు స్థానాలను టీడీపీ జనసేనకు ఇచ్చింది.
Next Story

