Tue Dec 16 2025 11:31:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పోలీసుల అదుపులో జగన్ బంధువు
వైసీపీ అధినేత జగన్ దగ్గర బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

వైసీపీ అధినేత జగన్ దగ్గర బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరు కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ నేరాల ఆరోపణలు సహా పలు కేసుల్లో విచారణ నడుస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వెంటనే ఈ చర్య తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అర్జున్‌రెడ్డి అదుపులోకితీసుకున్నారు. గతంలోనే అర్జున్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో అప్పటికే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు.
శంషాబాద్ విమానాశ్రయంలో...
ఆయన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి సన్నిహిత బంధువు. సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకుని, ఆ తర్వాత గుడివాడ పోలీసులకు అప్పగించారు.అర్జున్‌రెడ్డి, సజ్జల భర్గవ్తో కలిసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంలో చురుకుగా పనిచేశారు. ఆయనపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆన్లైన్ దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు, ఇతర తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

