Wed Jan 21 2026 02:40:42 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : 12వ జాబితాలో వీరికి చోటు
వైఎస్సార్సీపీ తన పన్నెండవ జాబితాను విడుదల చేసింది. నలుగురికి వివిధ పదవులలో నియమించింది

వైఎస్సార్సీపీ తన పన్నెండవ జాబితాను విడుదల చేసింది. నలుగురికి వివిధ పదవులలో నియమించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ వివిధ సర్వేల ద్వారా వచ్చిన నివేదికలను అనుసరించి ఇప్పటికే పదకొండు జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ ఇన్ఛార్జులను మారుస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో నలుగురికి కొత్తగా పదవులు ఇస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
అమర్నాథ్ ను...
మంత్రి గుడివాడ అమర్నాధ్ ను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా కావటి మనోహర్ నాయుడును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్ గా సత్యనారాయణమ్మను ఎంపిక చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. వరదు కల్యాణిని శాసనమండలిలో చీఫ్ విప్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

