Sun Mar 15 2026 22:53:18 GMT+0530 (India Standard Time)
వైసీపీ ప్లీనరీ మళ్లీ 2027లోనే
వైసీపీ ప్లీనరీ 2027లో మళ్లీ నిర్వహిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి తెలిపారు

వైసీపీ ప్లీనరీ 2027లో మళ్లీ నిర్వహిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ కోసం స్థలాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2017లో వైసీపీ ప్లీనరీ జరిగిందని, 2019 ఎన్నికల్లో తాము విజయం సాధించామని చెప్పారు. 2022 లో ప్లీనరీని జరుపుకుంటున్నామని తిరిగి 2027లో ప్లీనరీని మరోసారి జరుపుకుంటామని విజయసాయరెడ్డి రెడ్డి తెలిపారు. కిక్ బాబు..ఔట్ నినాదంతో ఎన్నికలకు వెళతామని చెప్పారు.
రెండు రోజుల పాటు....
2017లో ఇక్కడే వైసీపీ ప్లీనరీ జరిగిందని ఆయన చెప్పారు. ఇదే స్థలంలో మరోసారి ఈ నెల 8వ తేదీన ప్లీనరీని నిర్వహించుకుంటున్నామని చెపపారు. ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్లిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికీ ప్లీనరీ హాజరయ్యే అవకాశముంటుందన్నారు. వైఎస్ పుట్టిన రోజు సందర్బంగా జరుగుతున్న ఈ ప్లీనరీకి మరో ప్రత్యేకత ఉందని తెలిపారు. 8న జగన్ అధ్యక్ష ఉపన్యాసం, 9వ తేదన ముగింపు ఉపన్యాసం ఉంటుందన్నారు. జగన్ సంతకాలతో వార్డు స్థాయి కార్యకర్తలకు ఆహ్వానాలు పంపడం జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పారు.
Next Story

