Sat Mar 21 2026 00:19:48 GMT+0530 (India Standard Time)
పార్లమెంటు ఆవరణలో వైసీపీ నిరసన
పార్లమెంటు ఆవరణలో వైసీపీ నిరసనలకు దిగింది.

పార్లమెంటు ఆవరణలో వైసీపీ నిరసనలకు దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటు బయట వారు ప్లకార్డులతో తమ నిరసనలను తెలిపారు. రాజ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీసులే దగ్గరుండి వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని, గృహదహనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇళ్లపై దాడులు చేస్తూ...
మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడులు చేశారని, పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని, అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వెంటనే బాధ్యులపై చర్యలపై తీసుకోవాలని కోరారు. ప్రధాని జోక్యం చేసుకుని శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా దాడులు చేస్తున్నారన్నారు.
Next Story

