Sun Jan 12 2025 20:04:48 GMT+0000 (Coordinated Universal Time)
రాజు గారు రంగు మార్చేశారు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత కొంత కాలంగా అధికార పార్టీ రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత కొంత కాలంగా అధికార పార్టీ రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఢిల్లీలో రోజూ రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నారు. గత ఒకటిన్నర ఏడాదిగా ఇదే జరుగుతుంది. అయితే ఆయన ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చే బ్యాక్ గ్రౌండ్ కలర్ ను మార్చేశారు. పసుపు రంగు వేయించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇటీవల రాజీనామా చేస్తానని శపథం చేశారు.
రాజీనామా చేస్తానని....
ఫిబ్రవరిలోనే రాజీనామా చేస్తానని చెప్పినా మరి ఎందుకో వెన్కు తగ్గారు. వచ్చే నెనల 2 వతేదీన తన సొంత నియోజకవర్గం నరసాపురం వచ్చేందుకు రఘురామ కృష్ణరాజు సిద్ధమవుతున్నారు. ఆయన వైసీపీకి దూరమయ్యారని అర్థమవుతుంది. ఆయన ఏ పార్టీలో చేరతారన్న మీమాంస మొన్నటి వరకూ కొనసాగేది. బీజేపీ, టీడీపీలో ఏదో ఒకదానిలో చేరతారని అందరూ భావించారు. కానీ ఆయన టీడీపీలో చేరతారని ఆయన రంగుమార్చడంతో అర్థమయిందంటున్నారు మీడియా సమావేశానికి హాజరయిన ప్రతినిధులు. గతంలో ఉన్న రంగును తొలగించి తాను వైసీపీలో లేనని చెప్పకనే చెప్పారు రఘురామ కృష్ణరాజు.
Next Story