Sat Mar 07 2026 20:26:11 GMT+0530 (India Standard Time)
నా హత్యకు కుట్ర.. రెక్కీ అందుకే
తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు

తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తనను చంపేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ ను నియమించారని ఆయన ఆరోపించారు. తన హత్యకు ప్లాన్ చేశారని ఆయన అంటున్నారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడని, అతడిని పట్టుకోగా తాను పోలీస్ అని చెప్పారని ఆయన తెలిపారు.
సెక్యూరిటీ సిబ్బంది...
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని రఘురామ కృష్ణరాజు సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడిని విచారిన్తున్నారు. పోలీస్ ఐడీ కార్డు కూడా చూపించలేదు. రఘురామ కృష్ణరాజు ఈరోజు మోదీ పర్యటనకు భీమవరానికి వెళ్లాల్సి ఉంది. కానీ తన అనుచరులను భీమవరంలో అరెస్ట్ చేసి హింస పెడుతుండటంతో తాను వారి క్షేమం దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకున్నానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story

