Fri Dec 05 2025 12:43:22 GMT+0000 (Coordinated Universal Time)
జైల్లో నరకం చూశా : మిధున్ రెడ్డి
చేయని నేరానికి తాను జైలులో శిక్ష అనుభవించానని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు.

చేయని నేరానికి తాను జైలులో శిక్ష అనుభవించానని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో సంబంధం లేకపోయినా తనను ఇరికించారని మిధున్ రెడ్డి వాపోయారు. జైల్లో తాను 72 రోజుల పాటు నరకం అనుభవించానని మిధున్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు.
ఆధారాలు లేకుండా...
న్యాయస్థానం కూడా బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. జైల్లో తాను ఎవరితో మాట్లాడేందుకు వీలుండేది కాదని, వారానికి మూడు ఫోన్లు కాల్స్, మిలాఖత్ లు తప్పించి తాను ఎవరితో మాట్లాడకుండా ఒక ఉగ్రవాదిలా వ్యవహరించాలరని మిధున్ రెడ్డి అన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తనను జైల్లో నిర్బంధించిన వారు ఆధారాలు చూపించలేకపోయారన్నారు. తనను జైల్లో ఉంచి చంద్రబాబు పైశాచికానందం పొందారని మిధున్ రెడ్డి అన్నారు.
Next Story

