Sun Mar 15 2026 08:19:36 GMT+0530 (India Standard Time)
వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. ఈసారి ఎవరంటే?
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు

వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నరసరావు పేటలో కొత్త అభ్యర్దిని పెట్టాలని వైసీపీ అధిష్టానం భావించిందని.. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని అన్నారు. దానికి తాను బాధ్యుడిని కాదన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తన నివాసంలో లావు కృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి, నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. లావు కృష్ణదేవరాయలును నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరింది. ఈ విషయమై తన అభిప్రాయాన్ని లావు కృష్ణ దేవరాయలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అంటున్నారు. నరసరావు పేట ఎంపీ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే లావు కృష్ణదేవరాయలును గుంటూరుకు మార్చాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రతిపాదించింది.
Next Story

